Dragon to release in two parts: ఎన్టీఆర్ తాజా సినిమా ‘డ్రాగన్’ (Dragon Movie)రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది జూలైలో విడుదల కావాల్సిన ‘డ్రాగన్’ సినిమా రిలీజ్‌ను సడన్‌గా ఏడాది పాటు వాయిదా మేకర్స్ వాయిదా వేసినప్పుడే అందరు ఊహించారు ‘డ్రాగన్’ సినిమా రెండు భాగాలుగా వస్తుంది. ఫైనల్‌గా అదే నిజమైంది.
తొలిభాగం వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ అవుతుంది. మలిభాగం ‘డ్రాగన్ 2’ను కూడా అదే ఏడాది రిలీజ్ చేయానల్నది మేకర్స్ ప్లాన్. అంటే.. .‘డ్రాగన్ 1 (Dragon part1)’, ‘డ్రాగన్ 2 (Dragon part2)’ సినిమాల చిత్రీకరణలను ముందే పూర్తి చేసి, ఆరు నెలల వ్యవధిలో ఈ రెండు సిని మాలను రిలీజ్ చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే…రణ్‌వీర్‌సింగ్ ‘ధురంధర్’ స్టైల్లో అన్నమాట. ‘డ్రాగన్ పార్టు 1’ సినిమా 2027 జూన్ 11న విడుదల అయితే, ‘డ్రాగన్ పార్టు 2’ సినిమాను 2027 డిసెంబరు 4న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఒకవేళ ఈ తేదీకి ‘డ్రాగన్’ సినిమా రిలీజ్ కాని పక్షంలో 2028 వేసవిలో ‘డ్రాగన్ పార్టు 2’ మూవీ విడుదల అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ డ్రాగన్ సినిమాను మైత్రీమూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ ‘డ్రాగన్’ సినిమాలో అనిల్‌కపూర్, రాజీవ్‌కనకాల, కుష్భూ, గురుసోమసుందరం వంటి వాళ్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా డ్రగ్స్, మారణాయుధాల అక్రమ
రవాణా, ఓప్పియమ్ ఇల్లీగల్ ట్రాన్ఫోర్టేషన్…వంటి అంశాల నేపథ్యంతో సాగుతుంది. రవిబస్రూర్ ఈ ‘డ్రాగన్’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఒక సినిమా రెండు భాగాలుగా విడుదల కావడం అనే ట్రెండ్‌ను ‘బాహుబలి’తో రాజమౌళి స్టార్ట్ చేశారు. అయితే తమిళ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా మొత్తాన్ని ఒకేసారి చిత్రీకరించి, ఆరు నెలల వ్యవధిలోనే రెండు పార్టులను రిలీజ్ చేశారు. దర్శకుడు మణిరత్నం కంటే ముందు..కన్నడ దర్శకుడు హేమంత్ ‘సప్తసాగరాలు దాటి సైడ్ ఏ, సప్తసాగరాలు దాటి సైడ్ బీ’ చిత్రాలను ఒకేసారి చిత్రీకరించి, తక్కు వ సమయంలోనే ఈ రెండు భాగాలను విడుదల చేశారు.