పవర్‌పేట..రెండో హీరో అతనేనా?

Viswa
1 Min Read

Web Stories

Power peta Movie: పవర్‌పేట..ఈ టైటిల్‌ వినగానే తొలుత నితిన్‌ గుర్తొస్తారు. అవును..నితిన్‌ హీరోగా కృష్ణ చైతన్య దర్శ కత్వంలో తెరకెక్కాల్సిన సినిమా ఇది. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కనుందని, ఇందులో మరో హీరోగా సత్యదేవ్‌ కనిపిస్తారనే ప్రచారం బాగా సాగింది. కానీ ఈ సినిమా సడన్‌గా ఎందుకోగానీ అప్పట్లో నిలిచిపోయింది. ఈ తర్వాత ఇదే స్క్రిప్ట్‌తో కృష్ణ చైతన్య మరికొంతమంది హీరోలను అప్రోచ్‌ అయినా..ఎందుకో కానీ ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు.

ఇప్పుడు ఈ ‘పవర్‌పేట’ సినిమాలో సందీప్‌కిషన్‌ హీరో అని, కృష్ణ చైతన్య దర్శకత్వంలో విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తారని అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అయితే పవర్‌పేట సినిమాను ఎప్పడో అనౌన్స్‌ చేశారు. సో…కథను ఏమైనా, ఈ చిత్రం దర్శకుడు మార్చాడా? లేక..అదే టైటిల్‌ కాబట్టి, స్క్రిప్ట్‌కి కొన్ని తుదిమెరుగులు దిద్ది, మళ్లీ ఈ సినిమాను లైన్లో పెట్టాడా? అనేది చూడాలి. మరీ..ముఖ్యంగా ఈ సినిమా లోని సెకండ్‌ హీరో పాత్రను సత్యదేవ్‌నే చేస్తున్నారా? అనే విషయంపై కూడా సస్పెన్స్‌ కొనసాగుతుంది. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే..మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

ఇక వ్యూహం, త్యాగం, రాజకీయం, రక్తం..వంటి అంశాల మేళవింపుతో ‘పవర్‌పేట’ సినిమా ఉంటుందని, ఈ రోజు మేకర్స్‌ రిలీజ్‌ చేసిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ స్పష్టం చేస్తోంది.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi