please subscribe to Tollywoodhub YouTube channel

సాయిరామ్‌శంకర్‌ ఒక పథకం ప్రకారం మూవీ రివ్యూ

Viswa
3 Min Read
Oka Pathakam Prakaaram

Web Stories

కథ

Oka Pathakam Prakaaram Review: సిద్దార్థ్‌ నీలకంఠ (సాయిరామ్‌శంకర్‌) పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లాయర్‌. సీతను ప్రేమవివాహం చేసుకుంటాడు. ఓ రోజు సీతతో కలిసి సిద్దార్థ్‌ షాపింగ్‌కు వెళ్తాడు. కానీ అనూహ్యంగా సిద్దార్థ్‌ భార్య సీత మాయమై పోతుంది. సీత జాడ తెలియడం లేదని, సిద్దార్థ్‌ డ్రగ్స్‌కు ఎడిక్ట్‌ అవుతాడు. ఇలా అతని జీవితం సాగు తుండగా, సిద్దార్థ్‌ స్నేహితురాలు దివ్య (భాను శ్రీ) అతిదారుణంగా హత్య చేయబడుతుంది. దివ్య చావుకు కారణం సిద్దార్థ్‌యే అని, పోలీస్‌ ఆఫీసర్‌ ఏసీపీ రఘురామ్‌ (సముద్రఖని) అనుమానించి, అరెస్ట్‌ చేస్తాడు.

మరో పోలీసాఫీసర్‌ కవిత (శ్రుతీసోది) సిద్దార్థ్‌ దోషి కాదని నమ్ముతుంది. అయితే ఈ లోపు మరో మహిళ హత్యకు గురి అవుతుంది. అక్కడ సిద్దార్థ్‌కు చెందిన వస్తువులు దొరకడంతో, హత్యలు చేస్తుంది సిద్దార్థ్‌యే అని రఘురామ్‌తో పాటుగా, కవిత కూడా నమ్ముతుంది. ఈ క్రమంలోనే సిద్దార్థ్‌ అంటే గిట్టని లాయర్‌ చిన్నబాబు భార్య కూడా హత్య చేయబడుతుంది. అసలు…వరుసగా మహిళలను హత్య చేస్తున్నది ఎవరు? నిజంగా సిద్దార్థ్‌యే కిల్లర్‌నా? మిస్‌ అయిన సీత మళ్లీ సిద్దార్థ్‌కు దొరకుతుందా? అనేవి సినిమాలో చూడాలి. (Oka Pathakam Prakaaram Review)

విశ్లేషణ

రీసెంట్‌గా వచ్చిన మలయాళ సినిమాలు ‘కష్కిందకాండ, సూక్మదర్శిని’ వంటి వాటిని పరిశీలిస్తే…సినిమా స్టార్టింగ్‌లో చాలా స్లోగా ఉంటాయి. కథ, ట్విస్ట్‌లు అన్నీ చివరి అరగంట ఉంటాయి. ఇక పథకం ప్రకారం సినిమా కథ కూడా ఆల్మోస్ట్‌ ఇదే కోవలోకి వస్తుంది. తెలుగు సినిమాకు మలయాళ సినిమాల ప్రస్తావన ఎందుకంటే ఈ సినిమాకు దర్శకుడు విజయన్‌. మలయాళీ సినిమా దర్శకుడు.

భార్య కనిపించడం లేదన్న దిగులుతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్న సాయిరామ్‌శంకర్‌ సీన్స్‌తో సినిమా మొదలువుతుంది. సాయిరామ్‌ లవ్‌స్టోరీ, సాయిరామ్‌ కోర్టులో ఫెయిల్‌ కావడం వంటి సీన్స్‌తో సినిమా స్టార్టింగ్‌లో కాస్త స్లోగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే.. దివ్య చనిపోతుందో అక్కడ్నుంచి కథ వేగం పుంజు కుం టుంది. లాయర్‌ చినబాబు భార్య హత్య కేసుతో ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. ఇక సెకండాఫ్‌ అయితే స్టార్టింగ్‌ నుంచే ఉత్కంఠగా సాగుతుంది. వరుస హత్యలు, వాటి క్లూస్‌ను హీరో సేకరించడం, ఫైనల్‌గా కిల్లర్‌ను కనిపెట్టడంతో మూవీ ముగుస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ పర్వాలేదనిపిస్తుంది.

నాగచైతన్య-సాయిపల్లవిల ఎమోషనల్‌ లవ్‌స్టోరీ మూవీ తండేల్‌ రివ్యూ

కానీ కథలో కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయి. తొలిభాగంలో స్ట్రాంగ్‌గా కనిపించిన సముద్రఖని, లాయర్‌ చినబాబు, శ్రుతిల పాత్రలు ఒక్కసారిగా డౌన్‌ అయిపోతాయి. సెకండాఫ్‌ అంతా హీరోయే క్లూస్‌ను వెతుక్కోవడం, చనిపోయిన మహిళల లొకేషన్స్‌ను కనిపెట్టడంతోనే సాగుతుంది. మహిళలు అందర్నీ చంపిన కిల్లర్‌ హీరో సిద్దార్థ్‌ భార్య సీతను ఎందుకు చంపడో అర్థం కాదు. కిల్లర్‌ మోటివ్‌ సిద్దార్థ్‌ను చంప డమే అయినప్పుడు…ఇతరులను టార్గెట్‌ చేసి, సిద్దార్థ్‌ను జైలు పంపాలనుకోవడంలో క్లారిటీ చిక్కదు. క్లైమాక్స్‌లో వచ్చే డాగ్స్‌ ఫైట్‌ రోటీన్‌కు కాస్త భిన్నంగా ఒకే అనిపిస్తుంది.

పెర్ఫార్మెన్సెస్‌

సిద్దార్థ్‌ నీలకంఠగా సాయిరామ్‌శంకర్‌ (SairamShankar) యాక్టింగ్‌ పర్వాలేదనిపిస్తుంది. ఇప్పటివరకు రోటీన్‌ కమర్షియల్‌ సినిమాలు చేసిన సాయిరామ్‌శంకర్, ఓ డిఫరెంట్‌ రోల్‌ చేయడం ఆడియన్స్‌కు కాస్త కొత్తగా ఉంటుంది. ఓ రకంగా సినిమా అంతా సాయిరామ్‌శంకర్‌ భుజాలపై నడుస్తున్నట్లుంటుంది. సాధారణంగా సముద్రఖని పాత్రలు సినిమాల్లో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన రోల్‌ కాస్త వ్యంగ్యంగా, హాస్యంగా ఉంటుంది. పోలీసాఫీసర్‌ శృతికి మంచి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ దొరికింది. ఉన్నంతలో భాగానే యాక్ట్‌ చేసింది. ఆషిమా, భాను శ్రీల పాత్రలు గెస్ట్‌ రోల్స్‌ మాదిరి ఉండి పోతాయి. వినోద్‌ విజయన్‌ డైరెక్షన్, రాహుల్‌ రాజ్‌ మ్యూజిక్‌ ఒకే. గోపీసుందర్‌ ఆర్‌ఆర్‌ బాగుంటుంది. రాజీవ్‌ రవి కెమెరా ఒకే. నిర్మాణ విలువలు అంత గొప్పగా ఏమీ ఉండవు.

రేటింగ్‌: 2.5

బాటమ్‌లైన్స్‌: క్రైమ్, థ్రిల్లర్‌ జానర్స్‌ చూసే వారికి ఈ సినిమా ఓ ఛాయిస్‌. బెస్ట్‌ అని చెప్పలేం. కానీ ఓ సారి చూడొచ్చు.

 

 

 

 

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi