యాక్టర్‌గా, దర్శకుడిగా ధనుష్ చాలా చాలా బిజీ. 2023 జూన్ 21న «‘తేరే ఇష్క్ మే’ (Dhanush TereIshkMein) అనే సినిమాను ధనుష్ అనౌన్స్ చేశాడు. ధనుష్‌తో ఆల్రెడీ ‘రాంఝాణా, అత్రంగి రే’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఓ దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం సాగింది. కానీ ఎట్టకేలకు ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది.
ధనుష్ హీరోగా చేస్తున్న ఈ ‘తేరే ఇష్క్ మే’ (TereIshkMein) మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. ధనుష్, కృతీసనన్‌లు పాల్గొనగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మరికొన్ని రోజుల పాటు, ఈ మూవీ చిత్రీ కరణ ఇక్కడే సాగుతుంది. ఇందులో కృతీసనన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. «‘తేరే ఇష్క్ మే’ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు, ఈ మూవీని 2024లో రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించారు. కానీ షూటింగ్ 2025 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. దీంతో ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి.
ఇక ధనుష్ డైరెక్షన్‌లోని ‘జాబిలమ్మ నీకు అంత కోసమా..’ చిత్రం ఫిబ్రవరి 21న, ‘ఇడ్లీకడై’ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇవి కాకుండ హీరోగా ధనుష్ మరో మూడ్నాలుగు సినిమాలు చేస్తున్నారు. వీటిలో సంగీత దర్శకుడు ఇళయారాజా బయోపిక్, ‘అమరన్’ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియా సామీ, వెట్రిమారన్‌లతో ధనుష్ సినిమాలు కమిటైయ్యారు. ఈ సినిమాల అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి.