హీరో ఎన్టీఆర్ (NTRNeel)– దర్శకుడు ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లోని సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ఈ పాటికే ప్రారంభం కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడుతూ వ స్తోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోని ఈ 31వ సినిమా ప్రారంభోత్సవం 2024 ఆగస్టు 9న జరిగింది. ఆ సమయంలోనే ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను, జనవరి 09, 2026న రిలీజ్ అంటూ…రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఈ మూవీ చిత్రీకరణను స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ వీలుపడలేదు. ఫైనల్‌గా 2025 ఫిబ్రవరి 20 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తీస్తున్నాడు ప్రశాంత్‌నీల్. కానీ ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు. వచ్చే నెలలో ఈ సిని మా చిత్రీకరణలో పాల్గొంటారు ఎన్టీఆర్.
కాగా ఈ సినిమాలోని ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను గురించి పలురకాల వార్తలు వినిపించాయి. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌లో, బ్యాగ్రౌండ్‌లో వరల్డ్‌మ్యాప్, గోల్డెన్ ట్రయాంగిల్, చైనా–భూటాన్–కోల్‌కతా లొకేషన్స్‌లు హైలైట్ ఉండటం వంటి కారణాలు ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. అయితే ఈ మూవీ పీరి యాడికల్ ఫిల్మ్ అనేది కన్ఫార్మ్. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో డాన్‌గా కనిపిస్తారనే టాక్ నిన్న మొన్నటి వరకు ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ఈ మూవీలో ఎన్టీఆర్ 1970 కాలంలో ఉండే స్నైపర్ లాంటి రోల్‌ను చేస్తున్నారని తెలిసింది. కథ డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో ఉంటుందట. ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే, ఈ మూవీపై మరింత సమాచారం బయటకు వస్తుంది.
ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ తరహా టైటిల్ అయితే అన్నిభాషలకు యాప్ట్ అవుతుంది కూడా. ఇక ఈ మూవీలో కన్నడబ్యూటీ రుక్మిణీవసంత్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. మరో మలయాళ నటుడు టోవినోథామస్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో టోనినోథామస్‌ది విలన్ రోల్ కావొచ్చు. ఈ మూవీ చిత్రీకరణ కోసం హైదరాబాద్, కర్ణాటక లోకేషన్స్‌లో భారీ సెట్స్ వేశారు. మేజర్ షూటింగ్ మాత్రం కర్ణాటక సెట్స్‌లోనే జరుగుతుంది. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ మూవీకి రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ హీరోగా చేసిన మరో మూవీ ‘వార్ 2’ ఆగస్టులో రిలీజ్‌కు రెడీ అవుతోంది. హృతిక్‌రోషన్ మరో హీరోగా చేసిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.