NTR Movies: హృతిక్‌కు గాయం…ఎన్టీఆర్‌కు టెన్షన్‌

NTR Movies: హిందీ చిత్రం 'వార్‌ 2' షూటింగ్‌ విషయంలో ఎన్టీఆర్‌ కాస్త టెన్షన్‌ తీసుకుంటున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

Viswa
2 Min Read
NTR 2025

Web Stories

హృతిక్‌రోషన్, ఎన్టీఆర్‌లు హీరోలుగా హిందీలో ‘వార్‌ 2’ మూవీ రెడీ అవుతోంది. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు. ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను గురించిన అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు కానీ…షూటింగ్‌ మాత్రం ఆల్మోస్ట్‌ పూర్తి కావొచ్చింది. ఇం దులో భాగంగానే ఓ సాంగ్‌ను మేకర్స్‌ షూట్‌ చేయాలి. ఈ సాంగ్‌ కోసం ముంబైలోని ఓ స్టూడియోలో అంతా సెటప్‌ చేశారు. కానీ లాస్ట్‌ మినిట్‌లో రిహార్సల్స్‌లో భాగంగా హృతిక్‌ రోషన్‌ కాలికి గాయమైంది. దీంతో సాంగ్‌ షూట్‌ను వాయిదా వేశారు. గాయం కాస్త బలమైనదే కావడంతో, మేలో ఈ సాంగ్‌ షూట్‌ చేయాలని, మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

డ్రాగన్‌ షూటింగ్‌కు ఆటంకం

మరోవైపు ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ మూవీ చేస్తున్నాడు. మే నాటికి డ్రాగన్‌ షూటింగ్‌ మధ్యలో ఉంటుంది. ‘వార్‌ 2’లోని ఎన్టీఆర్‌ లుక్, డ్రాగన్‌లోని ఎన్టీఆర్‌ లుక్‌కు చాలా డిఫరెన్స్‌ ఉంది. ఒకసారి డ్రాగన్‌తో బిజీ అయిన తర్వాత మళ్లీ ‘వార్‌ 2’ షూటింగ్‌ కోసం లుక్‌ చేంజ్‌ అంటే…ఏం చేయాలని ఎన్టీఆర్‌ ఆలోచిస్తున్నారట. పోనీ డూప్‌తో కానిచ్చేయడానికి ఇది యాక్షన్‌ సీక్వెన్స్‌ కాదు…డ్యాన్స్‌ మూమెంట్స్‌. హృతిక్‌రోషన్‌ గ్రేస్‌కు, ఎన్టీఆర్‌ సూపర్భ్‌ డ్యాన్స్‌ తోడైతే స్క్రీన్‌పై అదిరిపోతుంది. సింగిల్‌ స్క్రీన్స్‌ దద్దరిల్లిపోతాయి. ఇలా హృతిక్‌రోషన్‌ గాయపడటం ….లుక్స్‌ పరంగా ఎన్టీఆర్‌ను టెన్షన్‌లోకి నెట్టింది.ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. అది ఏంటంటే…‘డ్రాగన్‌’ వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేద్దామను కుంటున్నారు. సంక్రాంతికి రిలీజ్‌ చేయాలంటే…‘డ్రాగన్‌’ షూటింగ్‌కు బ్రేక్‌ పడకూడదు. మధ్యలో ‘వార్‌ 2’ షూటింగ్‌ కోసం ఎన్టీఆర్‌ మళ్లీ డేట్స్‌ కేటాయిస్తే…‘డ్రాగన్‌’ షూటింగ్‌ వాయిదా పడుతుంది. ఇదే జరిగితే…సంక్రాంతికి ‘డ్రాగన్‌’ రిలీజ్‌ కావడం కష్టమే.

ఎన్టీఆర్‌ రాక్‌?

‘డ్రాగన్‌’ తర్వాత ..తమిళ దర్శకుడు ‘జైలర్‌’ ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ ఓ మూవీ చేయబోతున్నారు. ఈ సినిమాకు ‘రాక్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్‌తో నెల్సన్‌ ప్రస్తుతం ‘జైలర్‌ 2’ తీస్తున్నాడు. ఇది కంప్లీట్‌ అయిన తర్వాత ఎన్టీఆర్‌తో నెల్సన్‌ ‘రాక్‌’ మూవీ తీయవచ్చు. ‘రాక్‌’ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మించబోతున్నారు. ఎన్టీఆర్‌ గత చిత్రం ‘దేవర’ను సూర్యదేవర నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్‌ చేసిన విషయం తెలిసిందే.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Manasa Varanasi Shivani Nagaram Heroine Nabanatesh Latest Pics Krithishetty Ritika Nayak