రజనీకాంత్ (Rajinikanth) కెరీర్‌లో రీసెంట్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘జైలర్’ (Rajinikanth Jailer2 Shoot). 2023లో రిలీజైన ఈ మూవీ రూ. 600 కోట్ల రూపా యాల వసూళ్లతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది. 2023లో ఈ సినిమా రిలీజ్ కాగానే, అందరూ సీక్వెల్ (Rajinikanth Jailer2 Shoot) ఉంటే బాగుంటుందని అన్నారు.
జైలర్ 2…స్టార్ట్
అనుకున్నట్లుగానే నెల్సన్ తన నెక్ట్స్ మూవీగా ‘జైలర్ 2’ (Jailer 2) సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేయడం స్టార్ట్ చేశాడు. ఫైనల్‌గా కథ కూడా కుదరడంలో, ‘జైలర్ 2’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ రోజు నుంచి ‘జైలర్ 2’ చిత్రీకరణ చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభం కానున్నట్లుగా తెలిసింది. రజనీకాంత్ పాల్గొనగా, చిత్రంయూనిట్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. జైలర్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ బాగా ఫ్లస్ అయ్యింది. దీంతో జైలర్ 2కు కూడా అనిరుధ్‌యే సంగీతం అందిస్తారు.
గెస్ట్‌గా బాలకృష్ణ
తొలిపార్టులో భాగమైన మిర్నామీనన్, రమ్యకృష్ణలు ‘జైలర్ 2’లోనూ యాక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గెస్ట్‌లుగా కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, మలయాళ నటుడు మోహన్‌లాల్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌లు యాక్ట్ చేశారు. ఈ సారి ఈ గెస్ట్ లిస్ట్‌లో బాలకృష్ణ కూడా చేరతారని ఊహించవచ్చు. ఎందుకంటే…‘జైలర్’ సినిమాకు తాను టాలీవుడ్ నుంచి గెస్ట్ రోల్ కోసం బాలకృష్ణను అనుకున్నానని, కుదర్లేదని, నెల్సన్‌యే ఓ సందర్భంగా చెప్పారు. సో.. ఈ సారి నెల్సన్ ప్రయత్నాలు సక్సెస్ కావొచ్చు.
ఆగస్టులో కూలీ రిలీజ్?
ఇక రజనీకాంత్ లేటెస్ట్‌గా నటించిన మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లోని ఈ మూవీని సన్‌పిక్చర్స్ నిర్మించింది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ‘కూలీ’ మూవీని ఈ వేసవిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ ఇప్పుడు 2025 ఆగస్టులో రిలీజ్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.