హీరో రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ (Rajinikanth Coolie Release). సన్‌పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. కాగా, ఈ సినిమా ఎంటైర్ షూటింగ్ పూర్తయినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ‘కూలీ’ సినిమా షూటింగ్‌ను ఎనిమిది నెలల్లో పూర్తి చేశారు లోకేష్ కనగరాజ్. ఈ మూవీనిఈ ఏడాది ద్వీతీయార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబరులో కూలీ రిలీజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి.
#Coolie filming wrapped🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/571wwp1Gi0
— Sun Pictures (@sunpictures) March 18, 2025
పూజాహెగ్డే స్పెషల్‌సాంగ్
రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీలో పూజాహెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేశారు. కాగా ఈ మూవీ కోసం దాదాపు 30 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, సత్యరాజ్‌లు కలిసి యాక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ‘కూలీ’ మూవీలో దేవ పాత్రలో రజనీకాంత్, సైమన్ పాత్రలో నాగార్జున, కలీషాగా ఉపేంద్ర, ప్రీతిగాశ్రుతీహాసన్ యాక్ట్ చేశారు. ఇంకా బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ చేశారు. అనిరు«ద్ రవిచందర్ ఈ మూవీకి సంగీత దర్శకుడు. ఇంకా ఈ మూవీలో నాగార్జున విలన్‌గా యాక్ట్ చేస్తారనే ప్రచా రం జరుగుతోంది.
కూలీ థియేటర్స్‌లోకి వచ్చేది ఎప్పుడు?
కూలీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలైయ్యాయి. ఈ ఏడాదిలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలను కుంటన్నారు. సెప్టెంబరు 5, లేదా అక్టోబరు 16న ‘కూలీ’ సినిమాను విడుదల చేసే సాధ్యాసాధ్యాలపై మేకర్స్ సమాలోచనలు చేస్తున్నారని తెలిసింది.
రజనీకాంత్ నెక్ట్స్ మూవీ జైలర్2
రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన ‘జైలర్’ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌ను ప్రకటించారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఆల్రెడీ ‘జైలర్’ సీక్వెల్ ‘జైలర్ 2’ చిత్రీకరణ ప్రారంభమైంది. ‘కూలీ’ సినిమాను నిర్మించిన సన్‌పిక్చర్స్ సంస్థయే ‘జైలర్ 2’ను తీస్తోంది. అలాగే ‘కూలీ’ సిని మాకు సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్న అనిరు«ద్‌యే, ‘జైలర్ 2’కూ మ్యూజిక్ అందిస్తున్నాడు.