Officer on DutyOTT: ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా.. ఓ ఐఏఎస్‌పై.. డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ హరిశంకర్ అనుకోకుండ చేయి చేసుకుంటాడు. దీంతో హరిష్‌ను సస్పెండ్ చేస్తారు. కొంతకాలం తర్వాత తననుసీఐగా డిమోట్ చేసి, విధుల్లోకి తీసుకుంటారు. హరిష్ తిరిగి జాబ్‌లోకి వెళ్లిన తొలిరోజే ఓ గోల్డ్ చైన్ కేసు అతని పోలీస్‌స్టేషన్‌లో విచారణకు వస్తుంది. ఈ నకలీ గోల్డ్ చైన్ కేసును లోతుగా పరిశోధన చేస్తాడు. ఈక్రమంలో మరో రెండు నకలీ గోల్డ్ చైన్ వివరాలను కూడా హరి ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. కానీ అనూహ్యంగా ఈ మూడుగోల్డ్ చైన్స్‌లో ఒకటి తన పెద్ద కుమార్తె నీలాదని హరికి తెలుస్తుంది. కానీ అప్పటికే నీలా ఆత్మహత్య చేసుకుంటుంది. అసలు..తనకు చెప్పకుండ..తన కుమార్తె ఓ గోల్డ్ చైన్‌ను ఎందుకు తనఖా పెట్టింది? నకలీ గోలుసుతో ఇంట్లో వాళ్లను ఎందుకు మోసం చేసింది? అనే అనుమానాలు హరికి కలుగు తాయి. మరి..నీలా ఆత్మహత్యకు..డ్రగ్స్ పెడ్లర్ క్రిష్టి గ్యాంగ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? నీలా మరణం వెనక హరి భార్య గీతా (ప్రియమణి) ప్రేమేయం ఎంత? క్రిస్టి గ్యాంగ్‌ను హరిశంకర్ ఎలా పట్టుకోగలిగాడు? అన్నది సినిమాలో చూడాలి.
టీనేజర్లను టార్గెట్‌గా చేసుకుని, డ్రగ్స్ దందా చేసే ఓ ముఠా ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీనిఎందుకు టార్గెట్ చేసినప్పుడు ఏం జరిగింది? అన్నదే కథ. ఈ కథకు పోలీసాఫీర్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను యాడ్ చేశాడు దర్శకుడు జీతూ అష్రాఫ్. డ్రగ్స్, టినేజ్ అమ్మాయిలు మోసపోవడం, యువత పెడదారి పట్టడం వంటి అంశాలను చర్చించాడు. కర్ణాటకలో ఓ పోలీస్‌ఆఫీసర్ ఆత్మహత్య చేసుకుకునే సీన్‌తో..కథ మొదలవుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్లుగా…కథ ఎక్కడికో వెళ్లుంది (ఉదాహరణకు తమిళ సినిమా విశాల్ డిటెక్టివ్‌లో.. చిన్న కుక్కను ఎవరో చంపితే, ఆ కేసు వల్ల ఓ పెద్ద క్రైమ్ జరిగిన విషయం వెలుగులోకి రావడం…వంటిది).
కథ మొదలైనప్పట్నుంచే ఆడియన్స్‌లో ఓ క్యూరియాసిటీ మొదలవుతుంది. ఆ తర్వాత గోల్డ్ చైన్ ఇన్విస్టిగేషన్ సీన్స్, హరిశంకర్‌ను పోలీస్ వాళ్లు ఎందుకు తప్పించాలనుకున్నారు? ఈ కేసుకు తన పెద్ద కుమార్తె చావుకి ఉన్న లింక్‌ను హరిశంకర్ కనిపెట్టడం …వంటి సీన్స్‌తో మూవీ వేగంగా సాగుతుంది. సెకండాఫ్ బెంగళూరుకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ వచ్చే ఓ హాస్పిటల్‌లో వచ్చే ఓ మార్చూరీ యాక్షన్ సీక్వెన్స్‌ను బాగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. బస్సులో జరిగే ఓ చైన్ స్నాచింగ్‌తోసినిమా మొదలుతుంది. అయితే బస్‌లో జరిగిన మరో ఇన్సిడెంట్‌తోనే కోర్ స్టోరీ కనెక్ట్ అయ్యి ఉండటం అనేది….దర్శకుడి రచన శైలిని మెచ్చుకునేలా చేస్తుంది. ఇన్‌స్పెక్టర్ థామస్ మర్డర్ కేసును ఇన్వేస్టిగేట్ చేసే సీన్స్ బాగుంటాయి. క్లైమాక్స్ కూడా మెప్పిస్తుంది.
హరిశంకర్ రోల్‌లో కుంచాకో బోబన్ ఇరగతీశాడు. పర్‌ఫెక్ట్ సీరియస్ కాప్‌గా యాక్ట్ చేశాడు. ఉన్నకొద్దిపాటి ఎమోషన్స్ సీన్స్‌లోనూ పర్వాలేదనిపించాడు. కేఎస్‌ఆర్‌టీసీ కండక్టర్‌గా జగదీష్ బాగా చేశాడు. హీరో భార్య గీతగా ప్రియమణికి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినప్పటికీని…కోర్ కథ ఈ పాత్రతోనే ముడిపడి ఉంటుంది. డ్రగ్ పెడ్లింగ్ క్రిస్టిగా విశాక్ నాయర్ మంచి విలనిజం ప్రదర్శించాడు. హీరో పెద్ద కుమార్తె నీల పాత్రలో
మీనాక్షి అనూప్ ఓ గెస్ట్ రోల్ చేశాడు. హీరో ఫ్రెండ్, డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ సాహుల్‌గా వైఖాక్ శంకర్ ఉన్నంత సెటిల్డ్‌గా యాక్ట్ చేశాడు. సీజే ఆంటోనీ, జీతూ ఆష్రాఫ్..వారి వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు. జేక్స్ బిజోయ్ ఆర్‌ఆర్ బాగుంది. వర్గీస్ రాజ్ విజువల్స్, చమన్ చాకో ఎడిటింగ్ మెప్పిస్తాయి.