వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, అప్పుడప్పుడు ఫన్ మూవీస్ చేస్తుంటాడు శ్రీవిష్ణు. రీసెంట్ టైమ్స్‌లో శ్రీవిష్ణు నుంచి వచ్చిన ‘సామజవరగమన’ సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టింది. రూ. 50 కోట్ల రూపాయల బాక్సాఫీస్ క్లబ్‌లో చేరింది. ఈ మూవీలో శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ కూడా కుదిరింది. ఇప్పుడు మళ్లీ ఆ తరహా కామెడీ మూవీ ‘సింగిల్’ మూవీతో వస్తున్నాడు శ్రీవిష్ణు.
ఈ ‘సింగిల్’ (Srivishnu #Single movie ) మూవీకి కార్తీక్ రాజు దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియా చౌదరి నిర్మాతుల. కేతికా శర్మ, ‘లవ్‌టుడే’ ఫేమ్ ఇవానా హీరోయిన్స్‌గా చేశారు. ఈ మూవీ మే9న రిలీజ్‌కు రెడీ అయ్యింది. సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సూపర్..హిలేరియస్‌గా ఉంది. శ్రీవిష్ణు– వెన్నెల కిషోర్‌ల కామెడీ బాగా వర్కౌటైనట్లు అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. ట్రైలర్‌లో ఉన్న నవ్వులే. .సినిమాలో కూడా ఉంటే..ఆడియన్స్‌కు నవ్వుల పండగే మే 9న.
అసలే…పెద్ద పెద్ద సినిమాలకే సరైన రిలీజ్ డేట్ దొరక్కా…నానా హైరానా పడుతున్న ఈ సమయంలో శ్రీవిష్ణుకు మాత్రం లక్కీచాన్స్ దొరకింది. మే 9న శ్రీవిష్ణు ‘సింగిల్’ (#Single movie )మూవీ రిలీజ్ కాబోతుంది. ఇదే తేదీన … సమంత గెస్ట్ రోల్ చేసిన ‘శుభం’ (మిగతావారు నూతననటీనటులు), నవీన్‌చంద్ర ‘బ్లైండ్ స్పాట్’, శ్రద్ధా శ్రీనాథ్ ‘కలియుగమ్’ సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి.
ఈ సినిమాల్లో ముందు చెప్పుకోదగ్గ పర్‌ఫెక్ట్ మూవీ అంటే…అది శ్రీవిష్ణు ‘సింగిల్’ మూవీయే. మే9న ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ‘సింగిల్’ మూవీయే. ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, సులభంగా హిట్ స్టేటస్‌కు వెళ్లిపోతుంది. పైగా మే 1న నాని ‘హిట్ 3’ రిలీజ్. మోస్ట్ వయెలెంట్ మూవీ. ఫ్యామిలీస్ పిల్లలతో రావొద్దని యూనిట్‌నే చెబుతోంది. ఈ తరుణంలో ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చితంగా సింగిల్ మూవీకి వస్తా రు. ఇది శ్రీవిష్ణుకి మంచి ప్లస్ పాయింట్. మరి..శ్రీవిష్ణు కెరీర్‌కి ఈ సింగిల్ మూవీ ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలంటే…మరికొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు మరి..