‘తండేల్’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ మూవీతో సూపర్‌డూపర్ హిట్ కొట్టారు దర్శకుడు కార్తీక్ దండు. ఈ ఇద్దరు కాంబినేషన్‌లో మైథలాజికల్ టచ్‌తో కూడిన ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ (Vrushakarma movie) రాబోతుంది. ‘వృషకర్మ’ (NC24) అనే టైటిల్‌తో ఈ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఓ గుహసెట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపురూ. 5 కోట్ల రూపాయలు ఉంటుందట ఈ సెట్. ఈ గుహా సెట్‌లోనే అతి త్వరలోనే నాగచైతన్య షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సినిమాలో ఎంతో కీలకంగా ఉండే ఈ గుహా సన్నివేశాల ఏపిసోడ్ దాదాపు ఇరవై నిమిషాల పాటు ఉంటుంది.
Vrushakarma movie: వచ్చే ఏడాది మేలో రిలీజ్
ఈ వృషకర్మ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే నాగచైతన్య, మీనాక్షీ చౌదరిల పాత్రల తాలుకూ లుక్ టెస్ట్స్ జరిగాయి. నాగచైతన్య లుక్ అల్ట్రా స్టైలిష్‌గా మోడ్రన్‌గా ఉంటుంది. ఈ వృషకర్మ సినిమాను వచ్చే ఏడాది మేలో రిలీజ్ (Vrushakarma movie release) చేయాలను కుంటున్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓ నిధి అన్వేషణలో భాగంగా ఈ వృషకర్మ సినిమా సాగుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మేజర్ షూటింగ్‌ను సెట్స్‌లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్. ఇందుకోసం నాలుగైదు రకాల సెట్స్‌ను రూపొందించే పనిలో పడ్డారు ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర తంగాల.