ఇపాటికే షూటింగ్ స్టార్ట్ చేసుకోవాల్సిన ‘స్పిరిట్’ (Spirit movie) సినిమా చిత్రీకరణ ఇంకా టేకాఫ్ కాలేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ మొదటిసారి పోలీసాఫీసర్‌గా చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా కోసం హీరోయిన్‌గా పలురకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ గాసిప్ వార్తలో భాగంగానే సందీప్‌రెడ్డివంగా డైరెక్షన్‌లోని ‘స్పిరిట్’ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా ఫైనలైజ్ అయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది.
సడన్‌గా….‘స్పిరిట్’ (Prabhas Spirit movie) సినిమా నుంచి దీపికా పదుకొనె (Deepikapadukone) తప్పుకుటున్నట్లుగా ఇటు టాలీవుడ్..అటు బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ‘స్పిరిట్’ సినిమా కోసం దీపిక ప్రత్యేక కండీషన్స్ పెట్టిందని, ఎనిమిది గంటల కాల్షీట్స్ సమయాన్ని ఆరు గంటలకు తగ్గించిందని, తన పాతిక మంది స్టాఫ్ ఖర్చులను నిర్మాతలే భరించాలని అడిగిందని, పైగా రెమ్యూరేషన్‌తో పాటుగా… లాభాల్లో వాటాను కూడా దీపికా డిమాండ్ చేస్తున్నారని….ఈ కారణాల వల్లనే సందీప్ రెడ్డి వంగా (Director SandeepReddy Vanga) ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనెను తప్పించారనే టాక్ తెరపైకి వచ్చింది. ఒకవేళ దీపిక పదుకొనె (Deepikapadukone out from Spirit movie) పెట్టిన కండీషన్స్‌లో సగం నిజమే అయినా..సందీప్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదని, ఎందుకంటే ఆయన సోదరుడు ప్రణయ్‌రెడ్డి వంగా.. ‘స్పిరిట్’ సినిమాకు ఓ నిర్మాతగా ఉన్నారు కాబట్టి….బడ్జెట్ పెరిగితే నిర్మాతలకు ప్రాబ్లమ్.. సో..ఈ విధంగా దీపికాను ‘స్పిరిట్’ సినిమా నుంచి తప్పించి ఉండొచ్చని తెలుస్తోంది.
ధనుష్ చేతిలో రెండు బయోపిక్‌లు
మరోవైపు దీపికా పదుకొనె ప్రొఫెషనలిజమ్ గురించి, ఇప్పటివరకైతే మంచి టాక్‌నే ఉంది. ప్రభాస్ ‘కల్కి2898ఏడీ’ సినిమాలో కూడా నటించారామె. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటికీని. .‘కల్కి2898ఏడీ’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. మరి…‘స్పిరిట్’ విషయంలో అసలు నిజం బయటకు రావలంటే..ఈ చిత్రం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా అయినా మాట్లాడాలి. లేదా దీపికా పదుకొనె అయినా నోరు విప్పాలి. ఏదో ఒక సందర్భంగానయితే..దీపికా ఈ విషయంపై మాట్లాడక తప్పదు. చూద్దాం..ఆ సమయం వచ్చినప్పుడు దీపికా లేదా సందీప్‌రెడ్డి వంగా ఏం చెబుతారో..