please subscribe to Tollywoodhub YouTube channel

Kubera movie Release| కుబేర కొత్తగా ఉన్నాడే…!

Viswa
Nagarjuna and dhanush kubera

Web Stories

శేఖర్‌కమ్ముల సినిమాలంటే ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ మూవీస్‌లా ఉంటాయి. కానీ..ఆయన డైరెక్షన్‌లోని లేటెస్ట్‌ మూవీ ‘కుబేర’ (Kubera movie Release)  మాత్రం కాస్త కొత్త జానర్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీ వల ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర అంటూ మేకర్స్‌ విడుదల చేసిన ఓ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది. విజువల్స్, ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్‌ ఆర్‌ఆర్‌ బాగున్నాయి. ఇన్ని రోజులు..కుబేర సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఉన్న ప్రేక్షకుల అంచనాలను ‘ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర’ (Trance of kubera)  వీడియో పెంచే సిందనే అనుకోవాలి.

ఈ కుబేర సినిమాలో నాగార్జున (Nagarjuna), ధనుష్‌ (Dhanush)లు లీడ్‌ రోల్స్‌ చేశారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తున్నారు. హిందీ నటుడు జిమ్‌ సర్భ్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. మోస్ట్‌ లీ..విలన్‌ రోల్‌ కావొచ్చు. అంటే..మల్టీమిలియనీర్‌ అన్నట్లు. పైగా జిమ్‌ సర్భ్‌కు తెలుగులో ఇదే తొలి సినిమా కావడం మరో విశేషం. ధనుష్‌ కెరీర్‌లో కుబేర 51వ సినిమా. ఇంకా ఈ మూవీ ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర చూసినప్పుడు…డబ్బు ప్రధానంశంగా తెలుస్తోంది. కాస్త పీరియాడికల్‌ టచ్‌ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. నాగార్జున, ధనుష్, రష్మికామందన్నాల క్యారెక్టరైజేషన్స్‌ కొత్తగా ఉండేలా కనిపిస్తున్నాయి. శేఖర్‌ కమ్ముల, సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్న ఈ కుబేర చిత్రం జూన్‌ 20న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

 

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi