బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అయిన స్టార్ డైరెక్టర్ బోయపాటి..?

Kumar NA

Web Stories

Boyapati Srinu bollywood entry: టాలీవుడ్‌లో ఊర మాస్ యాక్షన్ సినిమాలకు పేరుపొందిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణతో ‘అఖండ 2’ వంటి భారీ విజయం సాధించిన బోయపాటి, తన స్టైల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు (Boyapati Srinu).

తాజా టాక్ ప్రకారం, బోయపాటి బాలీవుడ్ టాప్ స్టార్ రణవీర్ సింగ్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ఆయన ఇటీవల ముంబైకి వెళ్లి రణవీర్‌కు ఓ పవర్‌ఫుల్ కథను వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ధురంధర్’ విజయంతో ఉత్సాహంగా ఉన్న రణవీర్ ఈ కథకు ఒప్పుకుంటే, బోయపాటి బాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగమమవుతుంది.బోయపాటి సినిమాలు అంటే హై వోల్టేజ్ యాక్షన్, మాస్ ఎలివేషన్స్, గూస్‌బంప్స్ వచ్చే సీన్స్ అన్నీ ఉంటాయి. అదే ఫార్మాట్‌లో రణవీర్‌తో కూడా ఓ హై ఎనర్జీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాంబినేషన్ ఖరారైతే బాలీవుడ్‌లోనూ బోయపాటి మాస్ మేనియా మొదలవుతుందని అభిమానులు భావిస్తున్నారు (Boyapati Srinu).

ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్‌లో ఊర మాస్ యాక్షన్ చిత్రంగా ఉండే అవకాశం ఉందని టాక్. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రణవీర్ సినిమా ఒకటి ప్లాన్ చేశారు కానీ అనివార్య కారణాలతో అది ఆగిపోయింది. ఇప్పుడు బోయపాటితో సినిమా జరిగితే అదే సంస్థలో ఈ ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయినా ఈ కాంబినేషన్ గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది (Boyapati Srinu).

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos