అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ప్రభాస్ స్పిరిట్(Spirit) సినిమా చిత్రీకరణ ఈ పాటికే ప్రారంభం కావాల్సింది. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అసలు..ఎప్పుడు ప్రారంభం అవుతుందో అన్న క్లారిటీ కూడా లేదు. ప్రభాస్ ఎంతసేపూ ‘ది రాజాసాబ్, ఫౌజీ’ సినిమాల చిత్రీకరణలతోనే బిజీగా ఉంటున్నాడు. కానీ ఎట్టకేలకు స్పిరిట్ సినిమా అప్‌డేట్స్‌ని చెప్పారు ఈ చిత్రం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) . స్పిరిట్ సినిమాను ఈ సెప్టెంబరు నెలాఖరు నుంచి సెట్స్‌కు తీసుకుని వెళ్లనున్నట్లుగా ఆయన వెల్లడించారు. విజయ్‌దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, సందీప్ రెడ్డి వంగా, ‘స్పిరిట్’ సినిమా అప్‌డేట్స్‌ని వెల్లడించారు. అలాగే ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణను నాన్ స్టాప్‌గా జరి పేందుకు కూడా ప్లాన్స్ ఉన్నాయని సందీప్‌రెడ్డి వంగా చెబుతున్నారు.
ఈ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకోసం ప్రభాస్ స్పెషల్ మేకోవర్ కావాల్సి ఉంది. కానీ ప్రభాస్ ప్రజెంట్ చేస్తున్న ‘ది రాజాసాబ్, ఫౌజి’ సినిమాల బ్యాక్‌డ్రాప్ వేరు. దీంతో ఈ రెండు సినిమాల చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాతే ‘స్పిరిట్’ సినిమా షూటిం గ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ప్రభాస్. పైగా స్పిరిట్ సినిమా చేసేప్పుడు, మరే ఇతర సినిమా షూటింగ్‌లోనూ పాల్గొన వద్దని, ప్రభాస్‌ను రిక్వెస్ట్ చేశారట సందీప్ రెడ్డి వంగా. ‘స్పిరిట్’ సినిమాకు చెందిన ఓ కీలక షెడ్యూల్‌ను మెక్సికో జరపనున్నామని ఓ సందర్భంగా సందీప్‌రెడ్డియే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన యానిమల్ ఫేమ్ త్రిప్తీ డిమ్రీ (Tripti Dimri) హీరోయిన్‌గా చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీర్‌గా, త్రిప్తీ డిమ్రీ ఓ డాక్టర్‌గా కనిపించనున్నారని తెలిసింది. ప్రభాస్-త్రిప్తిల మధ్య బోల్డ్ సన్నివేశాలు కూడా ఉంటాయట. ‘స్పిరిట్’ సినిమాను 2026 చివర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషణ్‌కుమార్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు..’స్పిరిట్’ సినిమాను మొత్తంగా తొమ్మిది భాషల్లో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. వీటిలో చైనీస్, స్పానిష్, జపనీష్ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.