Yash’s Toxic:’కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత యశ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్ ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Yash’s Toxic). ఇంగ్లీష్- కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ( Geetu Mohandas) దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా షూటింగ్ ప్రజెంట్ ముంబైలో జరుగుతోంది. హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ జేజే ఫెర్రీ ఆధ్వర్యంలో టాక్సిక్ సినిమా కోసం కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీ కరించారు మేకర్స్. అయితే ఈ సినిమా నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ కూడా ముంబైలోనే ప్రారంభం కానుంది. దాదాపు 45 రోజులపాటు ఈ యాక్షన్ షూటింగ్ షెడ్యూల్ సాగుతుంది. కానీ ఈ యాక్షన్ షెడ్యూల్‌లో జేజే ఫెర్రీ రెగ్యులర్ స్టంట్ టీమ్ కాకుండ, ఆయన ఆధ్వర్యంలోనే ఇండియన్ స్టంట్ టీమ్ వర్క్ చేస్తారు. అంటే ముంబైలో జరుగనున్న ఈ యాక్షన్ షెడ్యూల్ కోసం జేజే ఫెర్రీ తన టీమ్‌ను పక్కనపెట్టి, ఇండియన్ స్టంట్ టీమ్‌తో వర్క్ చేస్తున్నారు.
ఇక టాక్సిక్ సినిమాలోని ఇతర నటీనటుల గురించి, ఇప్పటివరకైతే ఏటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కియారా అద్వానీ, శ్రుతీహాసన్, రుక్మిణీవసంత్, నయనతార, హ్యూమాఖురేషీ….ఇలా పలువురి పేర్లతే తెరపైకి వచ్చాయి. యశ్ సిస్టర్‌గా నయనతార, నెగటివ్ రోల్‌లో హ్యూమా ఖురేషి, హీరోయిన్‌గా రుక్మిణీవసంత్‌లు నటిస్తున్నారనే ప్రచారం అయితే గట్టిగా వినిపిస్తోంది.
ఇక ఈ టాక్సిక్ సినిమాను కేవీన్ ప్రొడక్షన్స్ వెంకట్ కే నారాయణతో కలిసి, తన మాస్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై యశ్ నిర్మిస్తున్నాడు. కన్నడ, ఇంగ్లీష్ భాషలతో పాటుగా, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. తొలుత ఈ టాక్సిక్ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత 2026 మార్చి 19కి వాయిదా వేశారు. ఆ నెక్ట్స్ వీక్ రామ్‌చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్ చిత్రాలు కూడా రిలీజ్ అవుతుండటం విశేషం.