‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరవాత హీరో పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీష్‌శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఉస్తాద్‌భగత్‌సింగ్ (Ustaad Bhagat Singh)’. ఈ సినిమాలో రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 6 నుంచి ఉస్తాద్‌భగత్‌సింగ్ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. పవన్‌కల్యాణ్‌తో పాటుగా, ఈ చిత్రంలోని ప్రధానతారాగణం ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. కాగా సెప్టెంబరు 2న పవన్‌కల్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పార్థీబన్, కేఎస్ రవికుమార్, ఎల్‌బీ శ్రీరామ్, రాంకీ, ప్రభాస్ శీను, జయ ప్రకాష్ వర్గీస్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త.
ఇక‘గబ్బర్‌సింగ్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’లోనూ పోలీసాఫీసర్‌గా యాక్ట్ చేస్తున్నాడు. అయితే ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ సినిమా తమిళ హిట్ ‘తేరీ’కి తెలుగు రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాలో విజయ్ మాదిరిగానే, పవన్‌కల్యాణ్ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుండటం, ఆ సినిమాలోలానే ఇద్దరు హీరోయిన్స్ చేస్తుండటం..వంటి అంశాలు దగ్గరగా ఉన్నాయి. దీంతో ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ సినిమా ‘తేరీ’కి తెలుగు రీమేక్ అనే టాక్ తెరపైకి వచ్చింది.
ఇక ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ సినిమా కాకుండ, సుజిత్ డైరెక్షన్‌లో ‘ఓజీ’ అనే గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా చేశారు పవన్‌కల్యాణ్. ఈ చిత్రం ఈ సెప్టెంబరు 25న విడుదల కానుంది. అలాగే కన్నడ నిర్మాణసంస్థ కెవీన్ ప్రొడక్షన్స్ సంస్థలో ఓ తమిళ దర్శకుడితో పవన్‌కల్యాణ్ ఓ సినిమా చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాగా, ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.