Mouli Tanuj:‘లిటిల్‌హార్ట్స్’ సినిమాతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు మౌళి తనుజ్ (Mouli Tanuj). కేవలం రెండున్నర కోట్ల రూపాయలతో రూపొందిన ఈ ‘లిటిల్‌హార్ట్స్’ సినిమా దా దాపు రూ. 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వరకు కొల్లగొట్టింది. ఈ సందర్భంగా ఈ ‘లిటిల్‌హార్ట్స్’ (Little hearts Movie success) సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వ హించారు. ఈ సెలబ్రేషన్ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కాగా, నిర్మా త అల్లు అరవింద్, నటుడు– నిర్మాత బండ్లగణేష్ అతిథులుగా మాట్లాడారు. అయితే ఈ సెలబ్రేషన్స్‌లో మౌళికి (Mouli Tanuj) బండ్లగణేష్ (Bandlaganesh) ఇచ్చిన సలహాలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవు తున్నాయి.
#MaheshBabu ట్వీట్#Vijaydevarakonda #రౌడీ టీ షర్ట్
ఇండస్ట్రీ లో అన్ని అబద్ధం
మరో శుక్రవారం మరో మౌళి వస్తాడు..pic.twitter.com/4iY3H7T0Xa
— TollywoodHub (@tollywoodhub8) September 18, 2025
‘సక్సెస్‌ను తలకు ఎక్కించుకోవద్దు. పొగడ్తలకు పొంగిపోవద్దు. మహేశ్‌బాబు ట్వీట్ వేశాడని, విజయ్ దేరకొండ రౌడీ టీ షర్ట్ ఇచ్చాడని పొంగిపోకు. అవన్నీ నీకు విషెష్ చెప్పడానికే. కానీ ఇండస్ట్రీలో ఇవన్నీ అబద్దాలు. మరో శుక్రవారం మరో మౌళి వస్తాడు. అంతా మారిపోతుంది. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఆశీర్వదిస్తున్నాను. జాగ్రత్తగా ఉండు’’ అని మౌళిని ఉద్దేశిస్తూ, ఓ లాంగ్ స్పీచ్ ఇచ్చాడు బండ్ల గణేష్.
బండ్ల గణేష్‌కు బన్నీ వాసు కౌంటర్
బండ్ల గణేష్‌కు బన్నీ వాసు కౌంటర్ ఇచ్చాడు. ఈ వేడుకలో బన్నీ వాసు నిర్మాత అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ–‘‘అందరికీ అల్లు అరవింద్ అంత అదృష్టం ఉండదు. మెగాస్టార్ చిరంజీవిలాంటి బామ్మర్ది ఉండరు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌లాంటి కొడుకు ఉండడు. అల్లు రామలింగయ్యవంటి ఫాదర్ ఉండరు. ఆయనకు డబ్బులు వస్తూనే ఉంటాయి’’ అంటూ మాట్లాడారు. ఆ తర్వాత ఈ విషయంపై బన్నీ వాసు మాట్లాడారు. ‘‘బండ్లన్న ఇక్కడ ఉన్నారో, వెళ్లిపోయారో నాకు తెలియదు. అల్లు అరవింద్‌గారు పుట్టిన తర్వాతే, అల్లు రామలింగయ్య గారు స్టార్ కమేడియన్ అయ్యారు. అల్లు అరవింద్‌గారు చాలా కష్టపడతారు’’ అంటూ మాట్లాడాడు.