Kantara: Chapter 1 PreRelease Event: ‘కన్నడ’ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ సినిమా రూపొందింది. ‘కాంతార’సినిమాలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన రిషబ్‌శెట్టియే ప్రీక్వెల్‌లోనూ హీరోగా నటించి, డైరెక్షన్ చేశాడు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ ‘కాంతార చాప్టర్ 1’ సినిమా అక్టోబరు 2 (Kantara Chapter1 Release date)న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘కాంతార చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ గెస్ట్‌గా హాజరైయ్యారు.
కన్నడలోనే మాట్లాడిన రిషబ్‌శెట్టి
అయితే ఈ వేడుకకు హాజరైన, రిషబ్‌శెట్టి (Kantarahero Rishbshetty ) తన స్పీచ్‌ను కన్నడలోనే మాట్లాడారు. ఇంగ్లీష్ భాష లో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీని, కన్నడ భాషలోనే మాట్లాడారు. తెలుగు తన సినిమా ప్రమోషన్స్‌కు వచ్చి, తెలుగులో మాట్లాడే ప్రయత్నం ఎలాగూ చేయలేదు. అయితే తెలుగు రాని కొంతమంది నటీనటులు తెలుగు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లా డటం గమనిస్తుంటాము. కానీ రిషబ్ ‘కాంతార చాప్టర్ 1’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంగ్లీష్‌లో కూడా మాట్లాడలేదు. కావాలనే కన్నడ భాషలో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. దీంతో ‘కాంతార చాప్టర్ 1’ ప్రీ రిలీజ్ వేడుకలో రిషబ్‌శెట్టి వైఖరి పట్ల, తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. తెలుగులో ‘కాంతార చాప్టర్ 1’ సినిమాను బాయ్‌కాట్ చేయాలన్నట్లుగా, సోషల్‌మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పైగా పవన్‌కల్యాణ్ ‘ఓజీ’తో పాటుగా, కొన్ని తెలుగు సినిమాల పోస్టర్స్ కర్ణాటకలో తెలుగులో ఫ్లెక్సీలుగా పెట్టినప్పుడు, కన్నడ ప్రేక్షకులు ఆగ్రహాం వ్యక్తం చేస్తారు. తెలుగు సినిమాలే అయినప్పటికీని, ఈ సినిమాల తెలుగు టైటిల్స్ కన్నడ భాషలోనే ఉండా లన్నట్లుగా మాట్లాడారు. కొన్ని చోట్ల చిన్నపాటి నిరసనలు కూడా చేశారు. ఇప్పుడు ‘కాంతార చాప్టర్1’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిషబ్‌శెట్టి కేవలం కన్నడలో మాట్లాడటం చర్చనీయాంశమైంది.
నివ్వెరపోయిన ఎన్టీఆర్
‘కాంతార చాప్టర్1’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను కన్నడ భాష లో మాట్లాడిన విషయాలను, ఎన్టీఆర్ తెలుగులో తర్జుమా చేసి, చెబుతున్నారని కూడా చెప్పారు. అయితే ఎన్టీఆర్ ఆ పని చేయలేదు. కానీ ఆశ్చర్యకరంగా కాస్ట్యూమ్ డిజైనర్, రిషబ్ శెట్టి భార్య ప్రగతి శెట్టి ఈ ఈవెంట్ లో తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసారు.
బ్రేక్ ఈవెన్ అవుతుందా?
మరోవైపు ‘కాంతార చాప్టర్1’ సినిమాకు తెలుగులో రూ. 100 కోట్ల బిజినెస్ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ‘కాంతార చాప్టర్1 ప్రీ రిలీజ్ వేడుకలో రిషబ్‌శెట్టి వైఖరి,
బాయ్‌కాట్ ‘కాంతార చాప్టర్ 1’ ట్రెండ్స్ నడుస్తున్న ఈ సమయంలో ‘కాంతార చాప్టర్ 1’ సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ అవుతుందా? అనే చర్చ జరుగుతోంది.