Balakrishna Aditya999: బాలకృష్ణ (Balakrishna) కెరీర్‌లోని ‘ఆదిత్య 369’ మూవీ బ్లాక్‌బస్టర్. మూడు దశాబ్దాల క్రితమే బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోని ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గ్రాఫిక్స్ టెక్నాలజీ అంతగా లేని ఆ రోజుల్లోనే సింగీతం శ్రీనివాసరావు విజువల్స్ పరంగా ఈ సినిమాను మాస్టర్ పీస్‌లా తీశారు. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని బాలకృష్ణ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఉన్నారు. కానీ కథ సెట్ కావడం లేదు. రెండు సంవత్సరాల క్రితం ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ సినిమా తీస్తున్నానని, కథ కూడా సిద్ధమైందని, అవసరమైతే తానే దర్శకత్వం వహిస్తానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి అయితే వెళ్లలేదు.
Contents
Balakrishna Aditya999: బాలకృష్ణ (Balakrishna) కెరీర్‌లోని ‘ఆదిత్య 369’ మూవీ బ్లాక్‌బస్టర్. మూడు దశాబ్దాల క్రితమే బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోని ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గ్రాఫిక్స్ టెక్నాలజీ అంతగా లేని ఆ రోజుల్లోనే సింగీతం శ్రీనివాసరావు విజువల్స్ పరంగా ఈ సినిమాను మాస్టర్ పీస్‌లా తీశారు. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని బాలకృష్ణ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఉన్నారు. కానీ కథ సెట్ కావడం లేదు. రెండు సంవత్సరాల క్రితం ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ సినిమా తీస్తున్నానని, కథ కూడా సిద్ధమైందని, అవసరమైతే తానే దర్శకత్వం వహిస్తానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి అయితే వెళ్లలేదు.ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ సినిమా తీయడానికి సన్నాహాలు మొదలైయ్యాయని, ఈ సినిమాతో తన కొడుకు నందమూరి మోక్షజ్ఞతేజ్(Mokshagna Teja) హీరోగా నటిస్తారని బాలకృష్ణ చెబుతున్నారు. చూస్తుంటే ‘ఆదిత్య 999’ సినిమాకు బాలకృష్ణయే దర్శకత్వం వహించి, నిర్మించేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను గురించిన పూర్తి సమాచారం, వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ బందిపోటు పాత్రలో కనిపి స్తారు. బాబీ (కేఎస్ రవీంద్ర) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నెక్ట్స్ బోయపాటి శీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేయనున్నారు బాలయ్య. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.