Korean Kanakaraju: వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా రితియానాయక్, మరో కీలక పాత్ర లో హాస్యనటుడు సత్య యాక్ట్ చేస్తున్నారు. జనవరి 19న వరుణ్‌తేజ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘కొరియన్ కనరాజు’ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ కొరికన్ కనరాజు సినిమాను ఈ వేసవిలో రిలీజ్ చేయనున్నట్లుగా తెలిపారు. ఈ ‘కొరియన్ కనకరాజు’ (VarunTej Korean Kanakaraju) సినిమా టైటిల్ గ్లింప్స్‌లో ఈ కింద ఉన్న డైలాగ్స్ ఉన్నాయి (TeluguCinemaNews).
‘కనకరాజు ఎక్కడున్నాడో చెప్పమంటున్నారు…’
‘మనం యాడున్నామో మనకే తెలియదు..ఇంక కనకరాజు యాడున్నాడో ఏట్లా సెప్పేది…’
‘కనకరాజు వచ్చేసినడమ్మీ…చేతులు ఖాళీగా లేవు..కానీ విజులేయ్…
‘వీడు మన కనకరాజు కాదమ్మీ…టైటిల్ పడతాదీ సూడు…’
‘కొరియన్ కనకరాజు…’
రాయలసీమలోని అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ హారర్ కామెడీ సినిమాకు కొంత కొరియన్ టచ్ కూడా ఉంది. కొరియన్‌దెయ్యం నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అందుకే ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ పెట్టారు. ఇక ఈ సినిమాలో కనకరాజు అనే పాత్రలో వరుణ్‌తేజ్ నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంట ర్‌టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి (Telugucinema). మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక వరుణ్‌తేజ్ నుంచి వచ్చిన గత మూడు చిత్రాలు ‘గాంఢీవదారి అర్జున, ఆపరేషన్ వాలైంటేన్, మట్కా’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన తరుణంలో, ఈ ‘కొరియన్ కనకరాజు’ సినిమా హిట్ సాధించడం, వరుణ్‌తేజ్ కెరీర్‌కు చాలా కీలకమని చెప్పవచ్చు.

References:
Greatwin casino bonus https://hit-n-spin-casino-online-login.online-spielhallen.de/
References:
Hard rock casino tampa fl https://gladjobs.com/employer/payid-pokies-2026-tested-payid-casinos-in-australia-4