NiharikaNM Interview: సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ నిహారిక ఎన్‌ఎమ్ తెలుగులో నటించిన తొలి సినిమా ‘మిత్ర మండలి’. ఈ సినిమా జర్నీలో భాగంగా, నిహారిక ఎన్‌ఎమ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.
‘‘నా పదహారు సంవత్సరాల సమయంలోనే యూట్యూబ్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. ఏదో టైమ్‌పాస్‌గా స్టార్ట్ చేశా. అప్పటికీ యూట్యూబ్ రెవెన్యూ అంటూ ఏమీ లేదు. ఆ తర్మాత యూట్యూబ్ రెవెన్యూ స్టార్ట్ అయ్యింది. ఇక ఇన్‌స్టా రీల్స్‌తో బాగానే సంపాదిస్తున్నా. పదిలక్షల రూపాయాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలకూ పనిచేశాను.

ఇక ‘మిత్రమండలి’ సినిమాలో నేనేం చేస్తానో నాకే తెలియదు. అలాంటి ఓ క్యారెక్టర్ చేశాను. కథ కోసం కాకుండ, కామెడీ కోసం మా ‘మిత్రమండలి’ సినిమాకు రండి. ఇక ఈ సినిమా ప్ర యాణంలో బ్రహ్మానందంగారిని కలిశాను. ఆయన నాకో సలహా ఇచ్చారు. ‘అబద్ధం చెప్పకు.. నిజం మాట్లడకు..నిశ్శబ్ధంగా ఉండకు’ అని చెప్పారు. కానీ అలా ఉండటం నా వల్ల కాదు.. ఎందుకంటే నేను అస్సలు సైలెంట్‌గా ఉండలేను. అది నా బలహీనత. అందుకే బ్రహ్మా నందం గారి సలహాను పాటించకలేపోతున్నాను (సరదాగా..). ఆయన చెప్పిన మరికొన్ని అంశాలను ఫాలో అవుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు నిహారిక ఎన్‌ఎమ్.

ఇంకా చెబుతూ– ‘‘మా అమ్మమ్మవాళ్లది విజయవాడు. నా వేసవి సెలవుల్లో నేను విజయవాడకు వచ్చేదాన్ని. మా తాతయ్యగారు చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ కూడా చెన్నై వచ్చారు. నేను పుట్టింది చెన్నై. పెరిగింది బెంగళూరు. కంపూటర్‌సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఎమ్‌బీఏ కూడా పూర్తి చేశాను. ఎమ్‌ఎఫ్‌ఏ ఫిల్మ్‌మేకింగ్ చేశాను. మహేశ్‌బాబుగారు నా ఫెవరేట్ హీరో. మహేశ్ గారు యాక్ట్ చేసిన ‘సర్కారువారిపాట’ సినిమాకు,ఆయనతో కలిసి రీల్స్ చేశాను. అ లాగే ఆయన నిర్మించిన ‘మేజర్’ సినిమాకూ వర్క్ చేశాను’’ అని అన్నారు.
ప్రస్తుతం నేను కన్నడంలో రెండు, తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కొత్తరకం సినిమాలు చేయాలని ఉంది. ‘మిత్రమండలి’ తర్వాత తెలుగులో కొత్త సినిమాలకు సైన్ చేస్తాను. ‘మిత్రమండలి’కి సైన్ చేసిన తర్వాతనే, తమిళంలో ‘పెరుసు’ సినిమాకు సైన్ చేశాను. కానీ ‘మిత్రమండలి’ సినిమా ఆలస్యంగా విడుదలవుతోంది.
ప్రియదర్శి హీరోగా నటించిన ఈ మూవీలో రాగ్ మయూర్, విష్ణు ఓఐ, ప్రసాద్ బెహరా ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఈ అక్టోబరు 16న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. బన్నీ వాసు ఓ నిర్మాత. విజయేందర్ ఎస్. ఈ సినిమాకు దర్శకుడు.
Отлично, что наткнулся на такой пост — совсем только что интересовался похожем разборе.