ARRehman: ఆ రెండు సినిమాల నుంచి తప్పుకున్న ఏఆర్‌ రెహమాన్‌?

Viswa
1 Min Read

ARRehman: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ రెండు సినిమాల నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సూర్య (Suriya45) హీరోగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిషను, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఏఆర్‌ రెహమాన్‌ను తీసుకున్నారు చిత్రంయూనిట్‌. కానీ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు ఏఆర్‌ రెహమాన్‌. సూర్య కెరీర్‌లోని ఈ 45వ సినిమాను డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది.ఆల్రెడీ మరోక మ్యూజిక్‌ డైరెక్టర్‌ను తీసుకున్నట్లుగా చిత్రంయూనిట్‌ ప్రకటించింది.

 

అలాగే రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు చిత్రంయూనిట్‌. ఈ స్పోర్ట్స్‌ డ్రామాకు కొంత మ్యూజిక్‌ వర్క్‌ను కూడా స్టార్ట్‌ చేశారు ఏఆర్‌ రెహమాన్‌. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఏఆర్‌ రెహమాన్‌ తప్పుకున్నారని, ఆయన ప్లేస్‌లో దేవి శ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన అయితే రావాలి. వృద్ధి సినిమాస్, సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్‌ కావొచ్చు.

ఏఆర్‌ రెహమాన్‌ జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఏఆర్‌ రెహమాన్‌, ఆయన భార్య సైరా భానులు దాదాపు ముప్ఫై సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచించి, ప్రస్తుతానికి మ్యూజికను కొంతకాలం ఏఆర్‌ రెహమాన్‌ పక్కన పెట్టి ఉండొచ్చు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *