దేవి శ్రీ ప్రసాద్‌ తొలి సినిమా ‘ఎల్లమ్మ’

Viswa

Web Stories

Yellamma movie: ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ హీరోగా కొత్త ప్రయాణం మొదలు పెట్టారు (Devi Sri prasad hero movie Yellamma). దేవి శ్రీ ప్రసాద్‌ హీరోగా నటించనున్న తొలి సినిమాకు ‘బలగం’ ఫేమ్‌ వేణు ఎల్దండి (Yellamma Movie Director Venu Yeldandi) దర్శకత్వం వహించనున్నారు. తెలంగాణలోని ఓ గ్రామం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సం క్రాంతి ఫెస్టివల్‌ సందర్భంగా ‘ఎల్లమ్మ’ గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేసి, ఈ ‘ఎల్లమ్మ’ సినిమాను అధికా రికంగా ప్రకటించారు (Yellamma movie trailer).

DeviSriprasad Yellamma Movie Title Poster
DeviSriprasad Yellamma Movie Title Poster

‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో రిలీజ్‌ కానుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటుగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు దేవి శ్రీ ప్రసాద్‌. ఇక ‘దిల్‌’ రాజు నిర్మాణంలో నటుడు వేణు ఎల్దండి దర్శకుడిగా పరిచయమైన ‘బలగం’ సినిమా 2023 మార్చిలో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఇక ‘ఎల్లమ్మ’ సినిమాలో తొలుత నాని హీరోగా నటించనున్నట్లుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోగా నితిన్‌ ఫైనలైజ్‌ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల నితిన్‌ కూడ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో, ఈ కథ శర్వానంద్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ల దగ్గరకు కూడా వెళ్లింది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించే తొలి అవకాశం దేవి శ్రీ ప్రసాద్‌కు దగ్గడం విశేషం. ఇక ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌ పాత్ర కోసం కీర్తీ సురేష్‌ను అనుకున్నారు మేకర్స్‌. కీర్తీ సురేష్‌ కూడా ఆల్మోస్ట్‌ ఒకే చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో ‘ఎల్లమ్మ’ చిత్రంలో ఎవరు హీరోయిన్‌గా నటించనున్నారనే విషయంపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది (Yellamma film updates).

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi