‘క’ డైరెక్టర్ తో మెగా హీరో.. పాన్ ఇండియా మూవీకి ప్లాన్..!

Kumar NA
1 Min Read

Web Stories

కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ‘క’ చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకులు సుజీత్, సందీప్. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ భారీ విజయం తర్వాత ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్లు తమ తదుపరి ప్రాజెక్టును ఒక మెగా హీరోతో పట్టాలెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన కెరీర్‌ను పాన్ ఇండియా లెవల్‌లో ప్లాన్ చేసుకుంటున్నారు.

‘విరూపాక్ష’తో రూ.90 కోట్ల మార్కును అందుకున్న తేజ్, ఇప్పుడు తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోవాలని చూస్తున్నారు. సుజీత్, సందీప్ చెప్పిన ఒక వినూత్నమైన స్టోరీ లైన్ సాయి తేజ్‌కు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా జరిగిన చర్చల తర్వాత, తాజాగా వారు వినిపించిన ఫైనల్ డ్రాఫ్ట్‌కు తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది కూడా భారీ బడ్జెట్‌తో కూడిన పాన్ ఇండియా సినిమాగానే ఉండబోతోందని సమాచారం.సాయి ధరమ్ తేజ్ లైనప్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను లైన్లో పెడుతున్నారు.

రోహిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 125 కోట్ల వ్యయంతో ‘ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్’ నిర్మిస్తున్న ఈ సోషియో-ఫాంటసీ డ్రామా షూటింగ్‌లో తేజ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే సుజీత్-సందీప్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. విభిన్నమైన కథలతో మెప్పించే సాయి తేజ్, ‘క’ సినిమాతో తన టాలెంట్ నిరూపించుకున్న ఈ యంగ్ డైరెక్టర్లతో జతకట్టడం సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విరూపాక్ష లాంటి వైవిధ్యమైన థ్రిల్లర్ల కోవలోనే ఈ సినిమా కూడా ఉంటుందేమోనని అభిమానులు ఆశిస్తున్నారు.

Please Share
Share This Article
2 Comments
  • Металлические лестницы и перила становятся визитной карточкой современного интерьера и экстерьера. Компания https://mastersmetall.ru/ специализируется на производстве конструкций представительского класса с использованием лазерной резки и сварки. Услуги включают 3D-проектирование, визуализацию, порошковую покраску и профессиональный монтаж лестниц на второй этаж, навесов и козырьков. Работы выполняются под ключ с выездом замерщика на объект в Москве и Московской области. Гарантия качества и идеальная шлифовка обеспечивают долговечность изделий, а каталог предлагает решения для любых архитектурных задач.

  • I hve been exploring foor a littlee biit foor anyy high-quality article or weblog
    plsts onn this kind off hoise . Explorin iin Yahoo
    I ultimately stuymbled uponn ths website. Sttudying thios information So i amm happy too exhibit that I havee a very
    good uncaqnny feelimg I came upon exctly whhat I needed.

    I such a llot definityely will maqke sue tto don?t disregaed this sige and gikve it
    a loolk oon a constant basis. xnxx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu