దసరాకు రామ్‌చరణ్‌ పెద్ది?

Viswa
1 Min Read
Ramcharan Peddi Song Shoot

Web Stories

Ramcharan Peddi Movie postponed: రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ మూవీ ‘పెద్ది’ సినిమా రిలీజ్‌పై పలు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేకర్స్‌ ఈ సినిమాను రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్‌ చేయనున్నట్లుగా తొలుత ప్రకటించారు. కానీ ఈ ‘పెద్ది’ సినిమా మార్చి 27కి రిలీజ్‌ కావడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారనే టాక్‌ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

తొలుత ‘పెద్ది’ సినిమా మే1న రిలీజ్‌ చేద్దామని మేకర్స్‌ అనుకున్నారట. కానీ ఇప్పుడు దసరా సందర్భంగా రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్‌. దసరా ఫెస్టివల్‌కు అయితే, ఈ సినిమా ఓ జాతరలా ఉంటుందని, దసరా హాలీడేస్‌ కూడా కలిసొస్తాయని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. కానీ ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌పై సరైన స్పష్టత అధికారికంగా రావాలంటే కొంత సమయం పడుతుందని తెలిసింది.

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబుసాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీస్పోర్ట్స్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా సినిమాలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివరాజ్‌కుమార్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ (Peddi cast and crew).

ఈ సినిమా కాకుండ, సుకుమార్‌తో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత, వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi