త్రివిక్రమ్ కి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్..?

Kumar NA
2 Min Read

Web Stories

ntr: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘కుమారస్వామి’ కథాంశంతో రూపొందాల్సిన భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని అట్లీతో ముందుకు వెళ్లడంతో, ఈ కథ ఎన్టీఆర్ చెంతకు చేరిందని వార్తలు వచ్చాయి. అయితే, తాజా పరిణామాలు ఈ క్రేజీ కాంబినేషన్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఎన్టీఆర్ వరుసగా భారీ చిత్రాలను లైనప్‌లో ఉంచడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ఆలస్యమైంది. ఇది రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉండటంతో తారక్ కాల్షీట్లు దీనికే ఎక్కువగా కేటాయించాల్సి వస్తోంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ నిర్మాత సుధాకర్ మిక్కిలినేని, ఈ ఏడాది మే నుంచే ‘దేవర-2’ షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ రెండు భారీ ప్రాజెక్టుల మధ్య త్రివిక్రమ్ సినిమాకు సమయం దొరకడం గగనంగా మారింది. ‘డ్రాగన్-1’, ‘దేవర-2’, ‘డ్రాగన్-2’.. ఇలా ఈ మూడింటిని పూర్తి చేయడానికి కనీసం 2027 చివరి వరకు సమయం పట్టవచ్చు. త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ ప్లాన్ ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో త్రివిక్రమ్ ఖాళీగా ఉండకుండా విక్టరీ వెంకటేష్‌తో ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం.47’ అనే చిత్రాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

ఇది పూర్తయ్యాక త్రివిక్రమ్ మళ్ళీ ఎన్టీఆర్ కోసం వేచి చూస్తారా? లేక వేరే హీరోతో ‘గాడ్ ఆఫ్ వార్’ చేస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. వరుస ప్రాజెక్టుల కారణంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్‌కు హ్యాండిచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. త్రివిక్రమ్ రాసుకున్న మైథలాజికల్ స్క్రిప్ట్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది కావడంతో, ఆయన మరో హీరోను ఎంచుకుంటారా లేక ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే వరకు ఆగుతారా అనేది సస్పెన్స్‌గా మారింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా చూడాలని ఆశపడే అభిమానులకు నిర్మాత సుధాకర్ ఇచ్చిన అప్‌డేట్ కొంత నిరాశ కలిగించేదే. ‘దేవర-2’ మొదలైతే ‘గాడ్ ఆఫ్ వార్’ కచ్చితంగా కొన్నాళ్లపాటు అటకెక్కినట్లే అనిపిస్తోంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu