AnushkaShetty Ghaati: ఘాటి రిలీజ్‌ ఎప్పుడంటే..!.

Viswa
1 Min Read
AnushkaShetty Ghaati Releaseing on April18

అనుష్కాశెట్టి (AnushkaShetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఘాటి’ (Ghaati) సినిమా విడుదల తేదీ ఖరారైంది. ‘ఘాటి’ సినిమాను 2025 ఏప్రిల్‌ 18న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆదివారం ప్రకటించారు. క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రెమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు(AnushkaShetty Ghaati).

వ్యాపార రంగంలో ఎదుగుతున్న ఓ మహిళ దారుణంగా మోసపోయి, ఆ తర్వాత అదే వ్యాపార సమ్రాజ్యానికి రాణిగా ఎలా ఎదిగింది? అన్నదే ఈ చిత్రం ‘ఘాటి’ చిత్రం కథ అని తెలిసింది. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ‘ఘాటి’ చిత్రం విడుదల కానుంది.

AkhilAkkineni: అఖిల్‌ చేయాల్సిన వందకోట్ల సినిమా క్యాన్సిల్‌?

అనుష్కాశెట్టి (AnushkaShetty) ఓ లీడ్‌ రోల్‌లో నటించిన ‘వేదం’ సినిమాకు క్రిష్‌ జాగర్లమూడి ((Krish Jagarlamudi) దర్శకత్వం వహించారు. మళ్లీ పద్నాలుగు సంవత్సరాల తర్వాత క్రిష్, అనుష్కాశెట్టి ఓ సినిమాకు పని చేస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం వైష్ణవ్‌తేజ్‌ ‘కొండపొలం’ నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో తప్పకుండ ఓ హిట్‌ కొట్టాలన్నఒత్తిడి క్రిష్‌పై ఉంటుందనుకోవచ్చు.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *