శంబాలలో బండభూతం

Viswa

Web Stories

Shambhala: ఎప్పట్నుంచో ఓ సాలిడ్‌ హిట్‌ కోసం హీరో ఆదిసాయికుమార్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ సరైన ఫలితం అయిలే రావట్లేదు. తాజాగా ‘శంబాల’ సినిమాతో ఆది సాయికుమార్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. డిసెంబరు 25న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇటీవల విడుదలైన  ట్రైలర్‌ (Shambhala Trailer) ఆసక్తికరంగానే ఉంది.

బండ భూతం కాన్సెప్ట్, ఓ ఊరిలో జరిగే వింత సంఘటనలు, వరుస హత్యలు, హారర్‌ ఎలిమెంట్స్‌..ఇలా ఓ మంచి మిస్టికల్‌ థ్రిల్లర్‌గా ఉండేలా ‘శంబాల’ మూవీ కనిపిస్తోంది. సృష్టిలో జరిగే ప్రతి సంఘటన వెనక సైన్స్‌ ఉంటుందని నమ్మే విక్రమ్‌ (ఆదిసాయికుమార్‌), ఓ ఊరికి వెళ్లి దుష్టశక్తలును అంతం చేయాల్సి రావడం అనే కాన్సెప్ట్‌ కాస్త పాతదే అయినా, దర్శకుడు యోగేంద్ర ముని (Shambhala Movie Director Ugandhar Muni) టేకింగ్‌ కొత్తగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఈ చిత్రంలో ఆదిసాయికుమార్‌ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్‌గా అర్చన అయ్యర్, స్వశిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్‌ ఈ చిత్రంలోని ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. రాజశేఖర్‌ అన్న భీమోజు, మహీధర్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించగా, యోగేంద్రముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ‘శంబాల’ చిత్రం డిసెంబరు 25న (Shambhala Movie Release date) థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

డిసెంబరు 25న శంబాలతో పాటుగా, మరోనాలుగైదు సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధమౌ తున్నాయి. ఈ తరుణంలో శంబాల బాక్సాఫీస్‌ రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos