Aamirkhan and Lokesh Kanagaraj: రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో ఆమిర్‌ఖాన్ (Aamirkhan) క్లైమాక్స్ పోర్షన్‌లో ఓ గెస్ట్ రోల్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ చిత్రం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ఆమిర్‌ఖాన్‌కు మంచి వైబ్ క్రియేటైంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా కుదిరింది. ఆమిర్‌ఖాన్‌తో ఓ సూపర్ హీరో సినిమా చేయనున్నానని లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) చెప్పారు. ఇటు లోకేష్‌తో తాను చేసే సినిమా 2026 అక్టోబరులో ప్రారంభం అవుతుందని ఆమిర్‌ఖాన్ కూడా చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది.
కానీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లోని సినిమా క్యాన్సిల్ అయ్యిందనే టాక్ ఇటు బాలీవుడ్ లోనూ, అటు కోలీవుడ్‌లోనూ చక్కర్లు కొడుతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లోని సినిమా క్యాన్సిల్ కావడానికి పలు రకాల కారణాలు తెరపైకి వచ్చాయి. ‘కూలీ’ సినిమా రిజల్ట్ ఒక కారణమైతే, ‘కూలీ’ సినిమాలో ఆమిర్‌ఖాన్ చేసిన ధాహా పాత్రపై నార్త్‌లో మంచి ట్రోలింగ్ జరగడం మరో కారణం. తాజాగా ఆమిర్‌ఖాన్ కూడా ఇదే చెప్తున్నాడు. ‘కూలీ’ సినిమాలో తాను చేసిన దాహా పాత్ర కేవలం రజనీకాంత్ కోసమే అని, ఈ పాత్ర చేయడం ఓ మిస్టేక్ అనే ఆమిర్ వాపోయాడు.
మరోవైపు లోకేష్ వర్కింగ్ స్టైల్ కూడ ఆమిర్‌ఖాన్‌కు నచ్చలేదట. సినిమా చేసేందుకు లోకేష్‌ను ఆమిర్‌ఖాన్ బౌండెడ్ స్క్రిప్ట్ అడిగితే, డ్రాఫ్ట్ స్క్రిప్ట్ మాత్రమే ఉందని, ఆన్‌లొకేషన్ ఇంప్రవైజేషన్స్‌తో ముందుకు వెళ్దామన్నట్లుగా లోకేష్ చెప్పాడట. దీంతో ఆమిర్‌ఖాన్ అసహనం వ్యక్తం చేసి, ఈ సినిమాను క్యాన్సిల్ చేశారనే టాక్ బాలీవుడ్‌లో తెరపైకి వచ్చింది. మరి…ఈ సినిమా ఉంటుందా? లేదా? ప్రచారంలోకి వచ్చిన ఈ పుకార్లు నిజమా? కాదా? అనేది తెలి యాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు మరి.