లెనిన్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Viswa

Web Stories

l Lenin Release : ‘ఏజెంట్‌’ వంటి డిజాస్టర్‌ మూవీ తర్వాత హీరో అక్కినేని అఖిల్‌ (AkhilAkkineni) హీరోగా నటిస్తున్న సినిమా ‘లెనిన్‌’. ఈ మూవీలో అఖిల్‌ సరసన హీరోయిన్‌ భాగ్యశ్రీభోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘వినరోభాగ్యమువిష్ణుకథ’ సినిమా ఫేమ్‌ మురళీ కిషోరు అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 70 శాతానికి పైగా పూర్తయింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘వారెవా వారెవా..’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. అలాగే ‘లెనిన్‌’ సినిమాను మే 1న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ ‘లెనిన్‌’ సినిమాను నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇక రాయలసీమ నేపథ్యంతో సాగే లవ్‌స్టోరీ సినిమా ‘లెనిన్‌’. ఈ చిత్రంలో అక్కినేని అఖిల్‌ టైటిల్‌ రోల్‌ చేస్తుండగా, భారతి అనే పాత్రలో భాగ్యశ్రీభోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో లెనిన్‌ తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని, ఓ ప్రముఖ ఆర్టిస్టు నటించనున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఈ పాత్రలో నాగార్జున నటించే అవకాశం ఉందనే ప్రచారం జరిగినా, ఇటీవల ఓ సందర్భంగా
నాగార్జున ఈ అంశాన్ని ఖండించారు. ఇంకా ‘లెనిన్‌’ సినిమాలో తొలుత హీరోయిన్‌గా శ్రీలీలను అనుకున్నారు. కొంత షూటింగ్‌ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ‘లెనిన్‌’ చిత్రం నుంచి శ్రీలీల తప్పు కున్నారు. ఆ తర్వాత శ్రీలీల ప్లేస్‌లోకి భాగ్యశ్రీభోర్సే వచ్చారు.

అలాగే ‘లెనిన్‌’ తర్వాత అఖిల్‌ చేయబోయే సినిమాపై కూడా ఇంకా చర్చ జరుగుతుంది. ప్రశాంత్‌నీల్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్‌తో అఖిల్‌ ఓ సినిమా చేయనున్నారు. గతంలో అఖిల్‌–అనిల్‌ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లోని సినిమాకు బ్రేక్స్‌ పడ్డాయి. ఇది భారీబడ్జెట్‌ చిత్రం కావడం, అఖిల్‌ లాస్ట్‌ మూవీ ‘ఏజెంట్‌’ డిజాస్టర్‌ కావడంతో, అఖిల్‌–అనిల్‌ల మూవీకి బ్రేక్‌ పడిందనే ప్రచారం జరిగింది. ‘లెనిన్‌’ హిట్‌ సాధిస్తే, అఖిల్‌–అనిల్‌ల సోషియోఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీ మళ్లీ సెట్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఊహించవచ్చు.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos