please subscribe to Tollywoodhub YouTube channel

ఓటీటీలో మలయాళ హిట్‌ అలప్పుళ జింఖానా..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే…

Viswa
Malayalam hit film Alappuzha Gymkhana Ott Streaming Date

Web Stories

మలయాళ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘అలప్పుళ జింఖానా’ (Alappuzha Gymkhana Ott )చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది . సోనీలివ్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వేదికగా ఈ మూవీ జూన్‌ 13 (Malayalam hit film Alappuzha Gymkhana Ott Streaming Date)నుంచి స్ట్రీమింగ్‌ కాను ంది. ఈ విషయాన్ని గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది.

ఖలీద్‌ రెహ్మాన్‌ దర్శకత్వంలో ‘ప్రేమలు’ ఫేమ్‌ నస్లైన్, లుక్‌మాన్, అవరాన్, గణపతి,సందీప్‌ ప్రదీప్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేజీ జీన్, శివహరిహరన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. జాబిన్‌ జార్జ్, సమీర్‌ ఖరాట్, సుబీష్‌ కన్నంచెరి ఈ సినిమాను నిర్మించారు.

(Alappuzha Gymkhana Ott Story)ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన జోజో జాన్సన్‌ (నస్లైన్‌), అతని స్నేహితులు స్పోర్ట్స్‌ కోటాలో కాలేజీ అడ్మిషన్‌ కోసం బాక్సింగ్‌ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం అలప్పుళ జింఖానాలో శిక్షణ తీసుకునేందుకు సిద్ధం అవుతారు. కోచ్‌ ఆంటోనీ జాషువా దగ్గర జోజో జాన్సన్, అతని ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ జిల్లా స్థాయి బాక్సింగ్‌ పోటోలో ఎలాగో అలా గెలిచి, రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్తారు. అక్కడ ఏం జరిగింది? పోటీలో గెలిచారా? లేదా? జోజో జాన్సన్‌ తన జీవితం గురించి, తన అసలైన ప్రతిభను గురించి ఏం తెలుసుకున్నాడు? అన్నదే ఈ చిత్రం కథ.

మలయాళం సినిమా అలప్పుల జింఖానా తెలుగు రివ్యూ

ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగానే సాగుంది. ఫ్రెండ్‌షిఫ్, కామెడీ, మన గురించి మనం తెలుసుకోవడం..వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా తెలుగులో థియేటర్స్‌లో విడుదలైనప్పుడు కూడా, ఆడియన్స్‌ను మెప్పించింది. మరి..ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi