AlluArjun Atlee movie Shoot: స్పీడ్‌ పెంచారు

AlluArjun Atlee movie Shoot: అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లోని మూవీ చిత్రీకరణ మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది.

Viswa
1 Min Read
AlluArjun Atlee movie Shoot5

అల్లు అర్జున్, అట్లీ మూవీ (AlluArjun Atlee movie Shoot) షూటింగ్‌ ఈ ఏడాది చివర్నుంచి ప్రారంభం కానుందనే ప్రచారం సాగుతోంది. కానీ ఈ సినిమాను అనుకున్న సమయానికంటే ముందుగానే, అంటే జూన్‌ లేదా జూలైలోనే ప్రారం భించా లని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఈ పనిలో భాగంగానే అల్లు అర్జున్‌కు సబంధించిన డిఫరెంట్‌ లుక్స్‌ టెస్ట్‌ చేశారు అట్లీ. ముంబైలో జరిగిందీ. వేరే ప్రపంచం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది. సో…అల్లు అర్జున్‌ గెటప్‌ ఈ మూవీలో కొత్తగా ఉండబోతుంది.

ఈ మూవీలో అల్లు అర్జున్‌ ట్రిపుల్‌ రోల్‌ చేస్తారట. దీంతో అల్లు అర్జున్‌కు చెందిన రెండుమూడు డిఫరెంట్‌ లుక్స్‌ను ట్రై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ మూవీ డిఫరెంట్‌ టైమ్‌లైన్స్‌లో ఉంటుందని, పునర్జన్మల కథా ంశంతో ఈ మూవీ ఉంటుందని సమాచారం. గ్రాఫిక్స్‌ వర్క్స్‌ ఎక్కువగా చేయాల్సి ఉంది. సో…వీలైనంత తొందరగా షూటింగ్‌ పూర్తి చేసి, గ్రాఫిక్స్‌ వర్క్‌ ్పపై ఫోకస్‌ పెట్టాలని అల్లు అర్జున్‌ అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేస్తోందని తెలిసింది. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ 2027లోనే రిలీజ్‌ చేయాలని అల్లు అర్జున్‌ డిసైడ్‌ అయ్యారట. మరి…ఏం జరుగుతుందో చూడాలి. సన్‌పిక్చర్స్‌ పతాంకపై కళానిధీమారన్‌ ఈ సినిమాను భారీబడ్జెత్‌తో నిర్మిస్తోంది.

Please Share
3 Comments