Mahavatar Narsimha for 98th Oscar: ఈ ఏడాది జూలైలో విడుదలైన మైథలాజికల్ యానిమేషన్ సూపర్‌హిట్ ఫిల్మ్ ‘మహావ నరసింహా’ (Mahavatar Narsimha) బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. దాదాపు రూ. 40 కోట్ల రూపా యల బడ్జెట్‌తో రూపొందిన ఈ యానిమేషన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల రూపాయలకు కలెక్ట్ చేసి, బంపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మహావతార నరసింహా సినిమాకు మరో అరుదైన ఘనత లభించింది.
అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న 98వ ఆస్కార్ అవార్డులకు మహావతార నరసింహా (Mahavatar Narasimha for Oscar Consideration) సినిమా అర్హత సాధించింది. బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ యానిమేటేడ్ ఫీచర్ ఫిల్మ్, ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగాల్లోని అవార్డులకు పోటీ పడేందుకు పరిగణించబడుతున్న సినిమాల జాబి తాను ఆస్కార్ కమిటీ ఇటీవల విడుదల చేసింది. బెస్ట్ యానిమేటేడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మొత్తం 30 సినిమాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సినిమాల జాబితాలో ‘మహావతార నరసింహా’ చిత్రం నిలిచింది. ముంబై ఫిల్మ్‌మేకర్ అశ్విన్ కుమార్ (Mahavar Narasimha Movie Director Ashwin Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ సినిమా రిలీజ్ విషయంలో క్రీయాశీలకంగా వ్యవహ రించింది.
మరి…‘మహావతార నరసింహా’ సినిమాకు ఆస్కార్ నామినేషన్ దక్కుతుందా? అనేది చూడాలి. ఒకవేళ ‘మహావతార నరసింహా’ సినిమాకు ఆస్కా ర్ నామినేషన్ దక్కితే, ఈ విభాగంలో ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకున్న తొలి భారతీయ సినిమాగా ‘మహావతార్ నరసింహా’ చిత్రం నిలుస్తుంది. ఈ విషయం తెలియాలంటే…వచ్చే జనవరి 23 వరకు ఆగాల్సిందే. ఎందు కంటే..ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న సినిమాల వివరాలను ఈ రోజునే రిలీజ్ ప్రకటించను న్నారు అకాడమీ ప్రతినిధులు. వచ్చే ఏడాది మార్చి 15న ఆస్కార్ అవార్డుల వేడుక జరుగు తుంది.