please subscribe to Tollywoodhub YouTube channel

జేమ్స్‌ కామెరూన్‌ ‘అవతార్‌ 3’ రివ్యూ

Viswa

Web Stories

Avatar Fire And ash Review in Telugu:‘అవతార్‌’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘అవతార్‌’, ‘అవతార్‌ 2: ద వే ఆఫ్‌ వాటర్‌’ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. మరి..ఈ జేమ్స్‌ కామెరూన్‌ డైరెక్షన్‌లో ‘అవతార్‌’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘అవతార్‌3’ ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? రివ్యూలో చది వేద్దాం.

Avatar Fire And ash Storyకథ

‘అవతార్‌:ది వే ఆఫ్‌ వాటర్‌’ సినిమా కథనం ముగిసిన చోటే, ‘అవతార్‌: ది ఫైర్‌ అండ్‌ యాష్‌’ చిత్రం కథ మొదలవుతుంది. జేక్స్‌ సల్లీ (సామ్‌ వర్తింగ్‌టన్‌), నేతిరి (జో సల్డానా) తమ కొడుకును కోల్పోయిన బాధలో ఉంటారు. ఈ దంపతుల కుమారుడు లోక్‌ (బ్రిటన్‌ డాల్టన్‌), కు మార్తె లు కిరి (సిగౌ ర్నీ వీవర్‌), టూక్‌ (ట్రినిటీ), దత్తపుత్రుడు స్పైడర్‌ (జాక్‌ చాంపియన్‌)లు కూడ ఇదే బాధలో ఉంటారు. మరీ…ముఖ్యంగా తన వల్లే తన సోదరుడు చనిపోయాడనే ఆపరాధ భావంతో లోక్‌ చాలా బాధపడుతుంటాడు.

మరోవైపు ‘అవతార్‌ 2’లో చనిపోయినట్లుగా కనిపించే కల్నల్‌ క్వారీచ్‌ తిరిగి ప్రాణం పోసుకుం టాడు. కల్నల్‌ క్వారీచ్‌ (స్టీఫెన్‌ లాంగ్‌) తన కుమారుడు స్పైడర్‌ను ఏలాగైనా, పండోరా గ్రహం నుంచి తీసుకువచ్చి, ఆర్డీఏ బృందానికి అప్పజెప్పాలని నిర్ణయించుకుంటాడు. పండోరా గ్రహంపై మానవులు జీవించలేరు. పండోరా గ్రహంపై గాలి వేరుగా ఉంటుంది. మరి..మాన వుడై నా స్పైడర్‌ ఆ పండోరా గ్రహంపై ఎలా జీవించగలుగుతున్నాడు? అనే విషయానికి సైంటిఫి క్‌గా రీజన్‌ కనుక్కుని, ఈ పండోరా గ్రహంపై మనుషులు కూడా జీవించేవిధంగా ఏర్పాట్లు చేయాలని, ఆ విధంగా పండోరాగ్రహంపై పట్టు సాధించాలన్నది ఆర్డీఏ టీమ్‌ లక్ష్యం.

ట్రబుల్‌ మేకర్‌ స్పైడర్‌ కోసం జేక్స్‌ సల్లీతో కల్నల్‌ క్వారీచ్‌ యుద్ధానికి దిగుతాడు. తన బలం సరి పోవడం లేదని, యాష్‌ అనే తెగకు చెందిన వరాంగ్‌ (ఉనా చాప్లిన్‌)తో చేతులు కలుపుతాడు క్వా రీచ్‌. మరి..క్వారీచ్, వరాంగ్‌లను పండోరా గ్రహంపై ఉన్న నేవి తెగ (జేక్స్‌ సల్లీ కుటుంబం తదితరులు..) వారు ఎలా అడ్డుకున్నారు? జేక్స్‌ సల్లీకి ఎవరు సాయం చేశారు? తన దత్తపుత్రుడు స్పైడర్‌ను జేక్స్‌ సల్లీ ఎందుకు చంపాలనుకున్నాడు? అన్న ఆసక్తికరమైన అంశాలను థియేటర్స్‌లో చూడాలి (Avatar Fire And ash Review)

విశ్లేషణ

కథగా చూసుకుంటే ‘అవతార్‌2: దే ఆఫ్‌ వాటర్‌’, ‘అవతార్‌ 3: ఫైర్‌ అండ్‌ యాష్‌’ చిత్రాలకు పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు. ‘అవతార్‌2: దే ఆఫ్‌ వాటర్‌’లో పోరాట సన్నివేశాలు వాటర్‌ నేపథ్యంతో సాగితే, మూడోభాగంలో పరాంగ్‌ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్‌ చేసి, పోరాట సన్నివే శాలను ఫైర్‌ నేపథ్యంతో చూపించారనిపిస్తుంది. ‘అవతార్‌ 2’లో చూపించినట్లుగానే, నేవి తెగపై దాడి జరగడం, మళ్లీ నేవి తెగ వారంతా, ఏకమై..వారిపై దాడి చేసిన వారిపై తిరిగి దాడి చేయడం, ఇందుకోసం సముద్రపు జీవరాసుల సాయం కోరటం..వంటి సన్నివేశాలు ‘అవతార్‌ 3’లోనూ ఉన్నాయి. ఈ సన్నివేశాలు రోటీన్‌గా అనిపిస్తాయి. పైగా నెక్ట్స్‌ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ అయితే ఈ సినిమాలో కనిపించదు. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ మాత్రం వర్కౌట్‌ అయ్యాయి.

జేక్స్‌ సల్లీ, నేతిరి పాత్రలకు ఎక్కువగా యాక్షన్‌ పోర్షన్స్‌ను కేటాయించి, వాళ్ల వారసుల పాత్రలకు మాత్రం ఎమోషనల్‌ సీన్స్‌ను డిజైన్‌ చేశారు జేమ్స్‌ కెమెరూన్‌. స్పైడర్‌ను కిరి
కాపాడే సన్నివేశం, స్పైడర్‌ను జేక్స్‌ సల్లీ ఎందుకు చంపాలనుకున్నాడు? అన్న సీన్‌లను మంచి ఎమోషనల్‌గా తీశారు. అలాగే యాక్షన్‌ సన్నివేశాలు ఈ సినిమాకు మేజర్‌హైలైట్‌ అని చెప్పవచ్చు. జేక్స్‌సల్లీని నేతిరి కాపాడే పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.

విజువల్‌గా మాత్రం ‘అవతార్‌ 3’ సినిమా ఓ రేంజ్‌లో ఉంది. ఆడియన్స్‌కు విజువల్‌ ఫీస్ట్‌ . కన్ఫార్మ్‌గా చెప్పవచ్చు. యాక్షన్‌ సినిమా లవర్స్‌కు ‘అవతార్‌ 3’ నచ్చుతుంది. కథ, కథనాల పరంగా వారి అంచనాలను మాత్రం అందుకోలేదనే చెప్పవచ్చు.

Avatar Fire And ash Cast and Crew:నటీనటుల పెర్ఫార్మెన్స్‌

జేక్స్‌ సల్లీ పాత్రలో సామ్‌ వర్తింగ్టన్‌ అద్భుతంగా యాక్ట్‌ చేశాడు. ఎమోషనల్, యాక్షన్‌ సీక్వెన్స్‌లో మెప్పించాడు. కానీ జేక్స్‌ సల్లీ పాత్ర ఈ సినిమాలో ఓ మెయిన్‌ లీడ్‌గానే కనిపించిందితప్ప హీరో రోల్‌లా అనిపించలేదు. జో సల్డానా పాత్ర నేతిరిను మొదట కొంచెం పవర్‌ఫుల్‌గా చూపించిన ఆ తర్వాత కాస్త డౌన్‌ చేశారు. బహుశా..వరాంగ్‌ పాత్రలో చేసిన ఉనా చాప్లిన్‌ను హైలైట్‌ చేసేం దుకు ఇలా చేసి ఉండొచ్చెమో. నేతిరి–వరాంగ్‌ ఫేస్‌ టు ఫేస్‌ సీన్స్‌ వచ్చిన ప్రతిసారి, వరాంగ్‌ క్యారెక్టర్‌దే పైచేయి అన్నట్లుగా చూపించడం ఇందుకు ఓ నిదర్శనం. కల్నల్‌గా స్టీఫెన్‌లాంగ్‌ పాత్ర ముగిసిన తీరు ఆసక్తికరంగా అనిపించదు. అలాగే వరాంగ్‌ రోల్‌ కూడా. ఇక కిరిగా సిగౌ ర్నీ వీవర్, టూక్‌గా ట్రినిటీ, స్పైడర్‌గా జాక్‌ చాంపియన్‌లు వారి వారి పాత్రల మేరకు యాక్ట్‌ చేశారు. ముఖ్యంగా కిరి పాత్ర ఈ సినిమాలో కీలకంగా కనిపిస్తుంది. ఒకరకంగా కథకు ప్రాణం పోసే పాత్ర కిరి. కథ, కథనం అంశాల్లో కొత్తదనాన్ని చూపించడంలో జేమ్స్‌ కామెరూన్‌ ఇంకాస్త దృష్టిపెట్టాలెమో అని ‘అవతార్‌’ ఫ్రాంచైజీ ఫ్యాన్స్‌కు అనిపించవచ్చు. సైమన్‌ సంగీతం, రస్సెల్‌ సినిమాటోగ్రఫీ సూపర్భ్‌గా ఉన్నాయి.

ఫైనల్‌గా..: ‘అవతార్‌’ ఫ్రాంచైజీలోని ‘అవతార్‌:ఫైర్‌ అండ్‌ యాష్‌’ (అవతార్‌ 3) చిత్రం కథ, కథనాల ప రంగా, ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ (అవతార్‌ 2)లానే ఉంటుంది. కాకపోతే..ఫైర్‌ బ్యాగ్రాప్‌లో యాక్షన్‌ విజువల్స్‌ కొత్తగా కనిపిస్తాయి. ‘అవతార్‌’ ఫ్రాంచైజీలోని మరో కొత్త పార్ట్‌లా కాకుండ, ‘అవతార్‌ 2’కి ఎక్స్‌టెన్షన్, అవతార్‌ 2లోని మరో భాగం అంటే ‘అవతార్‌2: పార్ట్‌ 2’ అన్నట్లుగా ‘అవతార్‌3’ సినిమా ఉంటుంది.

Please Share
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi