Beauty Review: నటీనటులు: అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర, వీకే నరేష్, వాసుకి, నందగోపాల్, నితిన్ ప్రసన్న, మురళీధర్ గౌడ్, ప్రసాద్ బెహరా
దర్శకత్వం: జేఎస్‌ఎస్ వర్థన్
నిర్మాణం: అడిదాల విజయ్‌పాల్ రెడ్డి, ఉమేష్ కుమార్ భన్సాల్
సంగీతం: విజయ్ బుల్గానిన్
కెమెరా: శ్రీ సాయికుమార్ దారా
ఎడిటింగ్: ఎస్‌బీ ఉద్ధవ్
నిడివి: 2 గంటల 19 నిమిషాలు
విడుదల తేదీ: 19 సెప్టెంబరు 2025
రేటింగ్:2/5
కథ
Beauty Cinema Review వైజాగ్‌లో అలేఖ్య ఇంటర్ స్టూడెంట్. తండ్రి నారాయణ (వీకే నరేష్) క్యాబ్‌డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. తల్లి పద్మ (వాసుకి) గృహిణి. నారాయణకు కూతురు అలేఖ్య అంటే ప్రాణం. దీంతో అలేఖ్య అడిగినవన్నీ చేస్తుంటాడు. ఓ సారి అలేఖ్య తన బర్త్ డేకి ఓ స్కూటీని కొనివ్వమని తండ్రిని అడుగుతుంది. ముందు డ్రైవింగ్ నేర్చుకోమంటాడు. అలా తనకు పరిచయం అయిన అర్జున్ సాయంతో అలేఖ్య స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంటుంది. ఈ క్రమంలో అర్జున్‌తో ప్రేమలో పడు తుంది. అర్జున్‌తో అలేఖ్య ఓ రొమాం టిక్ వీడియో కాల్ మాట్లాడే సమయంలో, ఆమె తల్లి చూసి అలేఖ్యను మందలిస్తుంది. ఎక్కడ తన గురించి తన తల్లి, తన తండ్రికి చెబుతుందో అన్న భయంతో ఇంటికి బయటకు వచ్చి అర్జున్‌తో వెళ్లిపోవాలను కుం టుంది. అలా అర్జున్–అలేఖ్య హైదరాబాద్ చేరుకుంటారు. కూతురు హైదరాబాద్‌లో ఉందని తెలుసుకున్న నారాయణ హైదరాబాద్‌కు వస్తాడు. మరి తన కూతుర్ని నారాయణ కలసు కోగలిగాడా? అర్జున్–అలేఖ్యల ప్రేమ కథ ఏమైంది? వీరిద్దరు హైదరాబాద్‌లో ఎలాంటి ఇబ్బం దులు ఎదు ర్కొన్నారు. కూతురు కోసం వైజాగ్ నుంచి వచ్చిన నారాయణకు హైదరాబాద్ పోలీసులు ఏ విధంగా సహాయం చేశారు? అన్నది మిగిలిన కథ (Beauty Review)
విశ్లేషణ
దర్శకుడు మారుతి ఈ సినిమాకు ఓ నిర్మాతగా ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై కాస్త బజ్ ఏర్ప డింది. కానీ బ్యూటీ సినిమాల చాలా రోటీన్‌గా ఉంటుంది. ఇంటర్ చదివే ఓ టీనేజ్ అమ్మాయి ప్రేమకి, క్రైమ్ ఎలిమెంట్‌ను యాడ్ చేసి, ఓ సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. కానీ కథనంలో ఏ మాత్రం కొత్తదనం లేదు.
అలేఖ్య స్కూటీ ఫ్యాంటసీ, మధ్యతరగతి తండ్రి నారాయణ జీవితం, అర్జున్‌తో అలేఖ్య ప్రేమ లో పడి, అర్జున్‌తో వెళ్లిపోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత అలేఖ్య– అర్జున్‌లకు పోలీసులతో ప్రాబ్లమ్ రావడం, నారాయణకు పోలీసులు హెల్ప్ చేయడం వంటి సన్నివేశాలతో సెకండాఫ్ సాగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటంది. క్లైమాక్స్ మళ్లీ మాములే. సినిమాలో రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువై నట్లుగా కనిపిస్తుంది.
టీసీ ఇంట్లో, లాడ్జ్‌లో హీరో హీరోయిన్లు మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. క్లైమాక్స్‌లో కూడా రొమాంటిక్ విజువల్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను అయితే ఇబ్బంది పెడతాయి. పెళ్లి తర్వాత అన్నీ అని చెప్పే అలేఖ్య…. టీసీ ఇంట్లో– లాడ్జ్‌లో ప్రియుడు అర్జున్‌తో రొమాన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కనిపించడం ఏంటో అర్థం కాదు. అలాగే ఓ మైనర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ రావడం మరో హైలైట్ పాయింట్. తండ్రీ–కూతుర్ల ఎమోషన్ ఎలివేట్ అయ్యే సీన్స్ పెద్దగా లేవు. స్క్రీన్ ప్లే కూడా రోటీన్‌గా ఉంటుంది.

నటీనటులు
అర్జున్ పాత్రలో అంకిత్ (Beauty movie Hero Ankith Koyya )చక్కగా నటించాడు. క్లైమాక్స్‌లో తనలోని మరో నటుడ్ని ఆడియన్స్‌కు చూపించే ప్రయత్నం చేశాడు. రొమాంటిక్ సీన్స్‌లో యాక్టింగ్ పరంగా మెప్పించాడు. ఇక ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అయిన నీలఖి (Beauty movie Heroine Nilakhi Patra) కూడా బాగా యాక్ట్ చేసింది. సినిమాను ముందుకు తీసుకువెళ్లే పాత్ర ఇది. ఇక తండ్రి పాత్రలో వీకే నరేష్ (VK Naresh) ఉన్నంతలో యాక్ట్ చేశాడు. నరేష్‌ను దర్శ కుడు సరిగ్గా వినియోగించుకోలేదు. తల్లి పాత్రలో ఉన్నంతలో వాసుకీ యాక్ట్ చేశారు. నెగటీవ్ షేడ్స్‌లో నాగేంద్ర, జూనియర్ ఆర్టిస్టుగా ప్రసాద్, పోలీస్ అధికారిగా నితిన్ ప్రసన్న, పోలీస్ కానిస్టేబుల్‌గా మురళీధర్ గౌడ్ వారి వారి పాత్రల పరిధి మేరకు యాక్ట్ చేశారు. సెకండాఫ్‌లో నితిన్ ప్రసన్నకు మంచి రోల్ దక్కింది. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ పెద్దగా వర్కౌట్ అయినట్లుగా లేదు. నిర్మాణ విలువలు ఒకే. ఎడిటింగ్ కూడా ఫర్వాలేదు. దర్శకుడు వర్థన్ కథను ఇంకాస్త బాగా చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే…సినిమాలో చాలా వరకు ఆడియన్స్ ప్రిడిక్ట్ చేయగల సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. ఫాదర్– డాటర్ ఎమోషన్ కూడా వర్కౌట్ కా లేదు.