please subscribe to Tollywoodhub YouTube channel

ChiruAnil Movie: అనిల్‌రావిపూడి హడావిడికి చిరు బ్రేక్‌

Viswa

Web Stories

దర్శకుడు అనిల్‌రావిపూడి (Director AnilRavipudi) ప్రమోషన్స్‌లో దిట్ట. తన సినిమాను విభిన్న రకాలుగా ప్రమోట్‌ చేసుకుని, ఆడియన్స్‌ దగ్గరకు తీసుకుని వెళ్లి, ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకురావడంలో అనిల్‌రావిపూడిది అందవేసిన చేయి. వెంకటేష్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఇది మరింత స్పష్టమైంది. ఈ సినిమా రూ. 300 కోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది.

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో (Hero Chiranjeevi) సినిమా (ChiruAnil Movie)  చేస్తున్నాడు అనిల్‌రావిపూడి. ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం అన్నపూర్ణస్టూడియోలో వేసిన ఓ సెట్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ఈ హైదరాబాద్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ కాగానే టీమ్‌ అందరూ, డెహ్రా డూన్‌ వెళ్లారట. అయితే ఏ హంగు ఆర్భాటం లేకుండానే ఈ నెల 23న ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేశాడు అనిల్‌రావిపూడి. తన సినిమాకు చెందిన ప్రతి విషయాన్ని ప్రమోట్‌ చేసుకునే అనిల్‌రావిపూడి, మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ విషయాన్ని మాత్రం రోటీన్‌గా చేశారు.

అయితే అనిల్‌ రావిపూడి ఇలా చేయడం వెనక రీజన్‌ ఉందట. ఇటీవల ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌ అంటూ అనిల్‌రావిపూడి చేసిన ఓ వీడియోకు మంచి అప్లాజ్‌ వచ్చింది. దీంతో అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే చిరంజీవి గత చిత్రం ‘విశ్వంభర’ గురించి మెల్లిగా మర్చిపోతున్నారు. త్రిష హీరోయిన్‌గా, ఆషికా మరో హీరో యిన్‌గా చేస్తున్న ఈ ‘విశ్వంభర’ సినిమాను భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది.

అయితే అనిల్‌రావిపూడి హడావిడి ఎక్కడ ‘విశ్వంభర’ సినిమాకు డ్యామేజ్‌ అవుతుందోనని, అనిల్‌రావిపూడిని కాస్త స్లో అవ్వమని చెప్పారట చిరంజీవి. విశ్వంభర సినిమా విడుదల తర్వాతనే, చిరంజీవి–అనిల్‌ రావిపూడిల మూవీ వరుస అప్‌డేట్స్‌ వస్తాయట. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలోని ఈ ‘విశ్వంభర’ మూవీ ఆగస్టులో విడుదల కావొచ్చనే టాక్‌ వినిపిస్తోంది. ఇక అనిల్‌రావిపూడితో చిరంజీవి చేస్తున్న సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. సాహు గారపాటి ఈ సినిమాకు నిర్మాత.

Hero Prabhas: విలన్‌గా ప్రభాస్‌?

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi