చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకు రీ షూట్స్ (Chiranjeevi Vishwambhara Reshoot) జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీని తొలుత ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ జనవరి 10న రిలీజ్ మానుకున్నారు. ఈ విషయామై, అప్పట్లో ఈ చిత్రం దర్శకుడు వశిష్ఠను ‘విశ్వంభర’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రశ్నించగా, ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిందని, ‘దిల్’ రాజు–చిరంజీవిల కోరిక మేరకు ‘విశ్వంభర’ సినిమాను జనవరి 10న రిలీజ్ చేయడం లేదని, విశ్వంభర స్థానంలో రామ్‌చరణ్ గేమ్‌చేంజర్ విడుదల అవుతుందని, ఇది టీమ్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయమేనని చెప్పుకొచ్చారు.
కానీ ‘విశ్వంభర’ సినిమా టీజర్‌కు వీపరితమైన నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీంతో టీమ్ డైలామాలో పడి పోయింది. వీఎఫ్‌ఎక్స్ పనులను మెరుగుదిద్దే పనిలో పడింది. ఎలాగూ సమయం దొరికింది కదా అని పని లో పనిగా రీ షూట్స్ కూడ చెస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం విశ్వంభర సినిమా కోసం చిరంజీవి ఇంట్రోసాంగ్‌ను భారీ సెట్‌లో తీస్తున్నారు. హైదరాబాద్ శివర్లలో ఈ సినిమా చిత్రీకరణ జరుగు తోంది. అంతేకాదు..ఈ పాటలో సాయిదుర్గాతేజ్, నిహారిక కొణిదెలలు కూడా గెస్ట్స్‌గా కనిపించనున్నట్లుగా తెలిసింది. ‘బ్రో’ మూవీ కోసం పవన్‌కల్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న సాయిదుర్గాతేజ్, ఇప్పుడు ‘విశ్వం భర’ మూవీ కోసం చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటుండటం విశేషం. ఇక చిరంజీవి ‘సైరా:నరసింహారెడ్డి’ మూవీలో చిన్న గెస్ట్ రోల్ చేసిన నిహారిక, మళ్లీ కొంతగ్యాప్ తర్వాత చిరంజీవి ‘విశ్వంభర’లో చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నారు.
యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీని జూన్ చివరి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. చిరంజీవికి ‘విశ్వంభర’ రిజల్ట్ చాలా కీలకం. ఎందుకంటే…అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌సింగ్ కేసరి, డాకుమహారాజ్ సినిమాలతో బాలకృష్ణ మంచి జోరు మీద ఉన్నారు. మరోవైపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ, తెలుగు ఇండస్ట్రీ హిట్ కొట్టి వెంకటేష్ మంచి జోష్‌లో ఉన్నాడు. ఈ తరుణంలో వస్తున్న ‘విశ్వంభర’ సినిమా రిజల్ట్, చిరంజీవికి ఎంతో కీలకం. ‘స్టాలిన్’ తర్వాత చిరంజీవితో మళ్లీ త్రిష యాక్ట్ చేస్తున్న మూవీ ఇదే. ఈ చిత్రంలో ఆషికారంగనాథన్, కునాల్‌కపూర్‌లు లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేస్తున్నారు.
‘విశ్వంభర’ మూవీ తర్వాత అనిల్‌రావిపూడితో సినిమా చేస్తారు చిరంజీవి. ఈ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఆ నెక్ట్స్ బాబీతో, శ్రీకాంత్ ఒదెల, సందీప్‌రెడ్డివంగాలతో మూవీలు చేస్తారు చిరంజీవి.