Dacoit Movie first Review: సోలో హీరోగా అడివి శేష్ నుంచి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత రాబోతున్న సినిమా ‘డెకాయిట్’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిం చబడిన, ఈ ద్విభాషా చిత్రం రేపు (ఏప్రిల్ 10)న (Dacoit Movie Release date)థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సందర్భంగా ‘డెకాయిట్’ సినిమా ఎలా ఉండబోతుందన్న విషయంపై ఓ లుక్ వేద్దాం.
‘డెకాయిట్’ సినిమాలో హరి పాత్రలో అడివిశేష్, సరస్వతి పాత్రలో మృణాల్‌ఠాకూర్ నటించారు. పోలీస్ ఆఫీసర్ స్వామి పాత్రలో బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ నటించారు. ఆమిర్‌ఖాన్ మేన కోడలు జైన్ మేరీ ఖాన్ మరో పోలీస్ పాత్రలో కనిపిస్తారు. సునీల్, ప్రకాష్‌రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు (Dacoit Movie cast and crew). ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో జోనితాగాంధీ యాక్ట్ చేయగా, భీమ్స్ సిసిరోలియో మ్యూ జిక్ అందించాడు. గ్యానీ ఆర్ఆర్ సమకూర్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ ఈ సినిమాను నిర్మించారు. సునీల్ నారంగ్ సహ–నిర్మాత. అనురాగ్ కశ్యప్, జైన్ మేరీఖాన్లకు తెలుగులో ‘డెకాయిట్’నే తొలి సినిమా. అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం, గూఢచారి’ సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేసిన షానియల్ డియో (Dacoit Movie Director Shaneil deo), ఈ ‘డెకాయిట్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇక తొలుత ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు శ్రుతీహాసన్‌ను ఎంచు కున్నారు. శ్రుతీహాసన్ కూడా షూట్లో పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణావల్ల శ్రుతీ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో, హీరోయిన్గా మృణాల్‌ఠాకూర్ ఎంట్రీ ఇచ్చారు. ఈ పాత సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా విడుదలైంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆడి యన్స్‌ను మెప్పించేలా ఉంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే…హరి (అడివి శేష్), సరస్వతి (మృణాల్ ఠాకూర్) ప్రేమికులు. పెళ్లి చేసు కుందాం అనుకుంటారు. కానీ ఓ అనూహ్య ఘటన కారణంగా, హరి జైలు పాలవుతాడు. ఇందుకు సరస్వతి చెప్పిన అబద్ధమే కారణమట. జైలు నుంచి బయటకు వచ్చి, హరి దుబాయ్ వెళ్లాలనుకుంటాడు.

కానీ తనను మోసం చేసిన సరస్వతిపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. సరస్వతి దగ్గరకు హరి వెళ్లగా. .అప్పటికే …వివాహం చేసుకున్న సరస్వతి…ఓ పెద్ద ప్రాబ్లమ్‌లో ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ నుంచి బయ టపడాలంటే దాదాపు కోటి రూపాయలు కావాలి. దుబాయ్‌కి వెళ్లడానికి హరికి డబ్బులు కావాలి. మరోవైపు తన వారిని కాపాడుకోవడానికి సరస్వతికి డబ్బులు కావాలి. దీంతో…ఈ ఇద్దరు కలిసి ఓ పెద్ద రాబరీని ప్లాన్ చేస్తారు. కానీ పోలీసులకు తెలుస్తుంది. మరి..ఆ తర్వాత ఏం జరిగింది? తనను మోసం చేసిన సరస్వతిని హరి తిరిగి మోసం చేసి పగ తీర్చుకున్నాడా? లేక సరస్వతినే హరిని తిరిగి మోసం చేసిందా? మధ్యలో పోలీసులు ఏం చేశారు? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ పరోక్షంగా స్పష్టం చేస్తుంది (Dacoit Movie Story Review).
ఇంట్రవేల్లో వచ్చే ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ మలుపు ఈ సినిమాలో స్పెషల్ ఏట్రాక్షన్‌గా ఉండబోతున్నాయి. అలాగే రాబరీ సీక్వెన్స్, మార్కెట్ యార్డ్ సీన్ ఈ సినిమాకు చాలా కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. మేజర్ కథాంశం రాయలసీమ నేపథ్యంలో ఉంటుంది. అడివి శేష్ మదనపల్లి యాస మాట్లాడతారు. టెక్నికల్‌గా కూడ ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. స్క్రీన్ ప్లే, స్టోరీ బాగా కుదిరాయట. రెండు గంటల 32 నిమిషాల పాటు ఈ సినిమా నిడివి ఉంటుంది. మరి..‘డెకాయిట్’ సినిమాకు ఆడియన్స్ వర్డిక్ట్ అనేది ఎలా ఉండబోతుందో, మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.
