గీత గోవిందం డైరెక్టర్ కి లక్కీ ఛాన్స్.. ఆ స్టార్ హీరోతో సినిమా..!

Kumar NA
1 Min Read

Web Stories

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పుడు టాలీవుడ్‌పై గట్టిగానే దృష్టి సారించారు. వరుస క్రేజీ ప్రాజెక్టులతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ కంటే టాలీవుడ్ డైరెక్టర్లకే సూర్య ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాతో పాటు, మరో క్రేజీ కాంబినేషన్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఒక భారీ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే ఆసక్తికరమైన పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు ఈ చిత్రంలో సూర్య సరసన నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది. ‘విశ్వనాథం అండ్ సన్స్’ పూర్తికాకముందే, సూర్య తన తదుపరి సినిమాను కూడా ఒక తెలుగు దర్శకుడికే అప్పగించినట్లు తెలుస్తోంది. ‘గీత గోవిందం’ ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో సూర్య నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ‘ఫ్యామిలీ స్టార్’ వంటి పరాజయం తర్వాత కూడా పరుశురామ్‌పై నమ్మకంతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నట్లు సమాచారం.

సర్కారు వారి పాట’, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన పరుశురామ్, ఈసారి సూర్య వంటి స్టార్ హీరోతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. త్వరలోనే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సూర్య క్రేజ్‌ను పరుశురామ్ ఎంతవరకు వాడుకుంటారో వేచి చూడాలి.

Please Share
Share This Article
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu