Deepikapadukone King Movie: షారుక్‌ఖాన్, దీపికా పదుకొనె ఆరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘ఓం శాంతి ఓం (2007)’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013)’, ‘హ్యాపీన్యూ ఇయర్ (2014)’, ‘పఠాన్ (2023)’, ‘జవాన్ (2023)’ చిత్రాల్లో షారుక్‌ఖాన్, దీపికా పుదుకొనె కలిసి నటించారు. తాజాగా ‘కింగ్’ (Shah Rukh Khan Next film King) సినిమా కోసం ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు (Deepikapadukone King Movie).
షారుక్‌ఖాన్ హీరోగా, ఆయన కుమార్తె సహానాఖాన్ మరో ప్రధాన పాత్రధారిగా, అభిషేక్ బచ్చన్ విలన్ పాత్రలో హిందీలో ‘కింగ్’ అనే సినిమా రూపుదిద్దుకుంటుంది. గతంలో షారుక్‌తో ‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకుడు. ఇక ప్రస్తుతం ‘కింగ్’ సినిమా కోసం దీపికా పదుకొనె పోలాండ్‌లో ఉన్నారు. ‘కింగ్’ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. కాకపోతే దీపికా పదుకొనె ఈ సినిమా షూటింగ్‌లో ఈ రోజు పాల్గొన్నారు. ‘కింగ్’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని, 18 సంవత్సరాలుగా తమ స్నేహాం కొనసాగుతూ ముందుకు వెళ్తుందని, దీపిక పదుకొనె ఇన్ స్టా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
View this post on Instagram
ఇక ప్రభాస్ ‘కల్కి2’ సినిమా నుంచి దీపిక తప్పుకున్నారు. ‘కల్కి 1’ కంటే ‘కల్కి 2’ కోసం దీపికా పదుకొనె ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగారని, తన సిబ్బంది జీతాలను కూడ నిర్మాతలే భరించాలనే కండీషన్ పెట్టారని, పైగా ‘కల్కి 2’ సినిమా లాభాల్లో వాటాలు దీపిక ఆశించారని, ఇందుకే ‘కల్కి’ టీమ్ దీపికను తప్పించారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కాగా, ఈ విష యంపై దీపిక ఏమైనా స్పందిస్తారా? అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. కానీ ‘కింగ్’ సినిమా అప్‌డేట్‌ని మాత్రమే దీపిక షేర్ చేసి, ‘కల్కి’ సినిమాకు సంబంధించిన వివాదంపై సైలెంట్‌గా ఉండిపోయారు.