please subscribe to Tollywoodhub YouTube channel

గుర్తుందా…గుర్తుందా…

Viswa

Web Stories

Guruthunda Music Video: భారతీయ చిత్ర పరిశ్రమలోని మంచి ప్రేమకథా చిత్రాల జాబితాలోకి ‘చెన్నైలవ్‌స్టోరీ’ సినిమా కూడా చేరు తుందని ఆశాభావం వ్యక్తం చేశారు హీరో కిరణ్‌ అబ్బవరం. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ (Chennai Love Story) . రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేష్, ఎస్‌కేఎన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ గౌరి ప్రియ హీరోయిన్‌గా నటించగా, మణిశర్మ ఈ సినిమాకు బాణీలు అందించారు. ఈ సిని మాలోని ‘గుర్తుందా .. గుర్తుందా..’పాట లిరికల్‌ వీడియోను మేకర్స్‌ హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు.

KiranAbbavaram Chenni Love Story Cinema song launch event

ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘చెన్నైలవ్‌స్టోరీ’ సినిమాలో ఓ సెటిల్డ్‌ క్యారెక్టర్‌ చేశాను. సాయిరాజేష్‌ ఈ సినిమా కథ చెప్పగానే, ఈ సినిమా బలం ఏంటో తెలిసింది. సినిమాను హిట్‌ చేయాలన్న తపనతోనే ఎస్‌కేఎన్‌ మాట్లాడుతుంటారు కానీ, బడ్జెట్‌ గురించి ఆలోచించరు. ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయలు ఖర్చు చేసి, సెట్‌ వేశారు. సినిమాల పట్ల ఆయనకు ఉన్న ప్యాషన్‌ నన్ను ఇన్‌స్పైర్‌ చేస్తుంటుంది. మణిశర్మగారు ఈ సినిమా కోసం ఏడు పాటలు కంపోజ్‌ చేశారు. రిలీజ్‌ రోజు ఈ సినిమా థియేటర్స్‌లో మణిశర్మగారి మ్యూజిక్‌ కన్సర్ట్‌ ఉంటుంది. ఒక గొప్ప లవ్‌స్టోరీ సినిమాగా ‘చెన్నైలవ్‌స్టోరీ’ సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది’’ అని చెప్పారు కిరణ్‌ అబ్బవరం.

‘‘మణిశర్మగారు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలుగా మా పేర్లు ఉండటం అనేది మా అదృష్టం. ప్రేక్షకులు ఖర్చు పెట్టే డబ్బుకు, విలువనిచ్చేలా, ఈ సినిమా ఉంటుంది’’ అని ఎస్‌కేఎన్‌ చెప్పారు.

‘‘ఈ సినిమా కోసం వంద రోజులు షూటింగ్‌ చేస్తున్నాం. నిర్మాతలు ఎస్‌కేఎన్, సాయిరాజేష్‌గార్లు నాకు ఎంతో సపోర్టివ్‌గారు ఉన్నారు. మణిశర్మగారి సంగీతంలో వర్క్‌ చేయడం సంతోషంగా ఉంది. కిరణ్‌ ఈ సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్‌లో ఒదిగిపోయారు’’ అని చెప్పారు రవి నంబూరి.

‘‘బేబీ సినిమా నిడికి ఐదు గంటలు వచ్చినప్పుడు, మూడు గంటలు ఎడిట్‌ అయ్యేలా, రవి నాకు హెల్ప్‌ చేశాడు. ఈ కృతజ్ఞతలో, ఈ‘చెన్నైలవ్‌స్టోరీ’ సినిమాకు నా కథతో, ఆయన్ను దర్శకత్వంచేయమని అడిగాను. నేను ఊహించిన దాని కంటే, ఆయన ఇంకా బాగా సినిమా తీస్తున్నారు. కిరణ్‌గారికి ఈ సినిమా ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అన్నారు సాయిరాజేష్‌. ‘‘ఈ సినిమా డిస్కషన్స్‌లో అద్భుతమైన పాటలు కుదిరాయి’’ అని చెప్పారు మణిశర్మ. ఈ చిత్రం హీరోయిన్‌ శ్రీగౌరి ప్రియతో పాటుగా, ఈ చిత్ర సహ–నిర్మాత ధీరజ్‌ మొగిలినేని మాట్లాడి, ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు.

వరుణ్‌తేజ్‌ బరి..సంక్రాంతి గురి

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi