యశ్‌ టాక్సిక్‌లో మెలిస్సా

Viswa

Web Stories

Rukmini Vasanth in Yash Toxic: యశ్‌ (Yash) హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌: ఏ ఫెయిరీ టేల్‌ ఆఫ్‌ గ్రోన్స్‌ అండ్‌ అప్స్‌’. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్‌ యాక్ట్‌ చేస్తున్నారు. రుక్మిణీ వసంత్, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, కియారా అద్వానీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి నయనతార, హ్యూమాఖురేషి, తారా సుతారియా, కియారా అద్వానీల ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ను విడుదల చేశారు. తాజాగా రుక్మిణీ వసంత్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ‘టాక్సిక్‌’ చిత్రంలో మెలిస్సాగా నటిస్తున్నారు రుక్మిణీ వసంత్‌.

ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్‌ (Director GeethuMohandas)దర్శకత్వం వహిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్‌తో కలిసి యశ్‌ ఈ సిని మాకు కథ రాశారు. అలాగే కెవిన్‌ ప్రొడక్షన్స్‌ అధినేత వెంకట్‌. కె. నారాయణతో కలిసి యశ్‌ ఈ సిని మాను నిర్మిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. మార్చి 19న రిలీజ్‌ ప్లాన్‌ చేశారు. ఇక ఈ సినిమాలో నయనతార, యశ్‌లు.. అక్కాతమ్ముడి పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తొలుత ఈ టాక్సిక్‌ సినిమాలోని నయనతార పాత్రకు బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనాకపూర్‌ను అనుకున్నారు మేకర్స్‌. కానీ ఆ తర్వాత కరీనా తప్పుకోవడంతో, ఆ పాత్రను నయనతార చేస్తున్నారనే టాక్‌ వినిపించింది. డ్రగ్స్, మాఫియా, కుటుంబ భావోద్వేగాలు…వంటి అంశాల మేళవింపుతో ఈ ‘టాక్సిక్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please Share
7 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos