పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘హ్రీం’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సినిమాతో రాజేశ్ రావూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శివమ్ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పణలో శివ మల్లాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ నటుడు సందీప్ కిషన్ క్లాప్ ఇచ్చారు. నటులు అలీ, బెనర్జీ, టాప్ ఆడిటర్ విజయేంద్ర రెడ్డి, సినిజోష్ అధినేత రాంబాబు పర్వతనేని ఈ వేడుకకు హాజరయ్యారు. దర్శకుడు రాజేశ్‌కి స్క్రిప్ట్‌ని అందించారు. నటుడు రాజీవ్ కనకాల కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ:
“నా మొదటి సినిమా నుంచే ఈ నిర్మాతతో పరిచయం ఉంది. శివ మల్లాల నాకు ఎంతో సన్నిహితుడు. ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా,” అని చెప్పారు.
నటుడు అలీ మాట్లాడుతూ:
“శివ మల్లాల, సుజాత నాకు కుటుంబ సభ్యుల్లాంటివారు. వారు నిర్మించనున్న ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా,” అని అన్నారు.
నటుడు బెనర్జీ మాట్లాడుతూ:
“ఈ సినిమాలో నేను మంచి పాత్ర పోషిస్తున్నా. శివ నాకు తమ్ముడిలాంటి వారు. పవన్ తాత, చమిందా, దర్శకుడు రాజేశ్ అందరికీ ఆల్ ది బెస్ట్,” అని తెలిపారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ:
“ఈ చిత్రంలో నేను కీలక పాత్రలో నటిస్తున్నా. హీరోయిన్ చమిందా వర్మ నటే కాకుండా డాక్టర్ కూడా. ఆమె దుబాయ్ నుంచి తెలుగులో నటించేందుకు వచ్చిన తెలుగమ్మాయి. పవన్ తాత, రాజేశ్ నాకు చాలా కాలంగా తెలిసినవారు. శివ మల్లాల గురించి నాకు 25 ఏళ్లుగా పరిచయం ఉంది. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి,” అని చెప్పారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శక-రచయిత జనార్ధన మహర్షి, నిర్మాత కె.బాబు రెడ్డి, తమిళ నిర్మాత జి. సతీష్ కుమార్, ‘ట్రెండింగ్ లవ్’ దర్శకుడు హరీష్ నాగరాజ్, ‘బహిష్కరణ’ దర్శకుడు ముకేష్ ప్రజాపతి, ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క, వనిత, శ్రీవాణి త్రిపురనేని తదితరులు పాల్గొన్నారు.
ఈ సినిమా కి సంగీతం మార్కస్ ఎమ్, కెమెరా : అరవింద్.