బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో హృతిక్‌రోషన్ (Hrithik Roshan film) హీరోగా తెలుగులో సినిమా చేస్తాడని, హఠాత్తుగా వార్తలు తెరపైకి వచ్చాయి. కేఎస్ రవీంద్ర (కొల్లిబాబీ) ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. ఈ సినిమాను మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.
విశేషం ఏంటంటే…బాలీవుడ్ భాయ్ సల్మాన్‌ఖాన్‌తో తెలుగు దర్శకుడు హరీష్‌శంకర్ సినిమా చేయబో తున్నాడని వార్తలు వచ్చిన 48 గంటల్లోనే… హృతిక్‌రోషన్‌తో దర్శకుడు కొల్లి బాబీ సినిమా అంటూ ప్రచా రంలోకి వచ్చింది.
కొన్నాళ్ల క్రితం చిరంజీవి కోసం బాబీ ఓ కథను రెడీ చేస్తున్నారని, అనిల్‌రావిపూడితో చిరంజీవి చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత, ఈ వాల్తేరు వీరయ్య (చిరంజీవి–బాబీ) కాంబినేషన్ రిపీట్ అవుతుందని వార్తలు వచ్చాయి. సడన్‌గా..ఇప్పుడు హృతిక్‌రోషన్ తో సినిమా అంటూ వార్తలొస్తున్నాయి.
ఇక ప్రస్తుతం హృతిక్‌రోషన్ ‘వార్ 2’ సినిమా ప్రమోషన్స్ పనుల్లో చాలా బీజీగా ఉన్నాడు. ఇంకా ఎన్టీఆర్‌తో హృతిక్‌రోషన్ ఓ సాంగ్ కూడా చేయాల్సి ఉంది. ఆగస్టు 14 వరకు హృతిక్‌రోషన్ పనులన్నీ ‘వార్ 2’ సిని మాతోనే.
అన్నట్లు…ఇటీవలే ‘క్రిష్ 4’ సినిమా తన దర్శకత్వంలో రానున్నట్లుగా హృతిక్‌రోషన్ ప్రకటించాడు. సో…‘వార్ 2’ తర్వాత హృతిక్‌రోషన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘క్రిష్ 4’నే కావొచ్చు.