కార్తీ కెరీర్‌లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్ మూవీ ‘ఖైదీ’ (Karthi Kaithi 2 shoot). లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లోని ఈ మూవీ 2019లో దీపావళికి విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. లోకేష్ కనగరాజ్‌కు ఈ మూవీ దర్శకుడిగా రెండోది. ఈ సినిమాతో లోకేష్ కనగరాజ్ ‘ఎల్‌సీయూ’ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)ను స్టార్ట్ చేశాడు. ‘ఖైదీ’ మూవీకి వెంటనే సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ తీయాలనుకున్నాడు కార్తీ. కానీ లోకేష్‌కు ఊహించని రీతిలో విజయ్ ‘మాస్టర్’, ‘లియో’, కమల్‌హాసన్ ‘విక్రమ్’, రజనీకాంత్‌తో ‘కూలీ’ (ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోంది) వంటి సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. దీంతో ‘ఖైదీ 2’ సినిమా చిత్రీకరణ ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే ఉంది.

ఈ ఏడాదే చిత్రీకరణ
ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న ‘ఖైదీ 2’ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లుగా కార్తీ పేర్కొన్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. నిన్న లోకేష్ కనగరాజ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఖైదీ 2’ను ప్రకటించారు కార్తీ. 2019లో దీపావళికి ‘ఖైదీ’ సినిమా రిలీజై, బ్లాక్‌బస్టర్ కొట్టింది. దీంతో..2026 దీపావళికి ‘ఖైదీ 2’ను రిలీజ్ చేయాలన్నది టీమ్ ప్లాన్ అని తెలిసింది.
రెండు సీక్వెల్స్‌లో కార్తి
ప్రస్తుతం కార్తీ ‘సర్దార్ 2’ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కావొచ్చు. మరోవైపు ‘ఖైదీ 2’ సినిమా చిత్రీకరణ మొదలు కాబోతుంది. ఇలా..ఒకేసారి కార్తీ రెండు సీక్వెల్స్‌లలో వర్క్ చేస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.