వారణాసి రిలీజ్ వాయిదా?.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చిన జక్కన్న..!

Kumar NA
2 Min Read

Web Stories

Varanasi Release: సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అడ్వెంచరస్ డ్రామా ‘వారణాసి’. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీపై వస్తున్న రకరకాల ఊహాగానాలకు జక్కన్న తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కలయికలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ మార్చి 5, 2027న విడుదలవుతుందని అధికారిక ప్రకటన రావడంతో, మహేష్ బాబు ‘వారణాసి’ (Varanasi Release date)వాయిదా పడుతుందనే ప్రచారం మొదలైంది. ఈ పుకార్లపై రాజమౌళి స్పందిస్తూ..

వారణాసి గ్లింప్స్‌లోని రాముడు, హనుమంతుడికి సంబంధించిన విజువల్స్ షేర్ చేస్తూ “2027లో వస్తున్నాం” అని తేల్చి చెప్పారు. దీనితో సినిమా వాయిదా పడే ప్రసక్తే లేదని స్పష్టమైంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని 2027 మార్చి 26న శ్రీరామనవమి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట (MaheshBabu VanasiMovie Release date). అందుకే జక్కన్న రాముడి విజువల్స్‌ను షేర్ చేస్తూ హింట్ ఇచ్చారని టాక్. ‘వారణాసి’ చిత్రంపై అంచనాలు పెరగడానికి మరో ముఖ్య కారణం మహేష్ బాబు గెటప్స్. ఈ సినిమాలో మహేష్ రాముడి పాత్రతో పాటు మరో నాలుగు విభిన్నమైన అవతారాల్లో కనిపిస్తారని సమాచారం. మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండటం ప్రాజెక్టుకు మరింత బలాన్ని చేకూర్చింది.

బాక్సాఫీస్ వద్ద భారీ సమరం

2027 మార్చి నెల ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బాక్సాఫీస్ క్లాష్‌కు సాక్ష్యం కాబోతోంది. మార్చి 5న ప్రభాస్ మాస్ పవర్ చూపించబోతున్నారు. మార్చి 26న రాజమౌళి – మహేష్ గ్లోబల్ మ్యాజిక్ మొదలవబోతోంది. కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఈ రెండు భారీ చిత్రాలు విడుదల కానుండటంతో ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ద్వారా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెంచిన ‘వారణాసి’, రాజమౌళి బ్రాండ్ వాల్యూతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi