జనరల్‌గా ఏదైనా సినిమా సక్సెస్ అయితే…ఆ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తీస్తుంటారు. కానీ తమిళ సినిమా ‘సర్దార్ 2’ (Karthi sardar 2) మాత్రం సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. ఈ మూవీలో సీక్వెల్, ప్రీక్వెల్…ఇలా రెండు అంశాలు ఉంటాయట. కథ రిత్యా ఈ మూవీలో కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు.
సో..తండ్రి సర్దార్ పాత్రకు సంబంధించిన ప్రీక్వెల్ సీన్స్, కొడుకు పాత్రకు సంబంధించి సీక్వెల్ సీన్స్ ఉంటాయట. పాయింట్ ఆసక్తికరంగానే ఉంది. మరి…ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూడాలి.
కార్తీ (Karthi) హీరోగా పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో 2022లో వచ్చిన సర్దార్ సినిమా సూపర్‌హిట్. ఈ మూవీకి కొన సాగింపుగా ‘సర్దార్ 2’ (Sardar2) తీస్తున్నారు. ‘సర్దార్ 2’ సినిమాకు కూడా పీఎస్ మిత్రనే డైరెక్టర్. కాకపోతే… క్యాస్టింగ్ పెరిగింది. రజీషా విజయన్‌తో పాటుగా, ఈ మూవీలో ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్‌లు హీరోయిన్స్‌గా యాక్ట్ చేస్తారు. ఎస్‌జే సూర్య విలన్ రోల్ చేశారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్ వీడియోలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి..మూవీ ఎలా ఉంటుందో చూడాలి. మరి..ఆసక్తికరమైన అంశం ఏంటంటే…‘సర్దార్ 2’ సినిమాకు తొలుత మ్యూజిక్ డైరెక్టర్‌గా యువన్ శంకర్‌రాజాను అనుకున్నారు. కానీ ఆ ప్లేస్‌లో ‘పుష్ప, క’ వంటి సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన సామ్‌సీఎస్‌ను ఎంపిక చేసుకున్నారు మేకర్స్. ఇక ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘సర్దార్ 2’ చిత్రం 2025లోనే థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.