SSMB29: ఎన్నాళ్లో వేచిన ఉదయం…ఈనాడే నిజమైంది

హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లోని మూవీ ప్రాథమిక ప్రారంభోవ్సతం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. కేఎల్‌ నారాయణ నిర్మించనున్నారు.

Viswa
2 Min Read
SSMB29 Will Release in 120 Countries

Web Stories

SSMB29: హీరో మహేశ్‌బాబు (MaheshBabu), దర్శకుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లోని మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అసలు… ఈ సినిమా ఎప్పుడెప్పుడు అవుతుందా? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు భారతీయ సినీ ప్రేమికులు. మొత్తానికి ఈ సినిమాను జనవరి 2, 2025న అధికారికంగా లాంచ్‌ చేశారు మేకర్స్‌. హైదరా బాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉన్న రాజమౌళి ఆఫీస్‌లో ఈ సినిమా ప్రాధమిక ప్రారంభోత్సవం జరిగింది. వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కనుందనే టాక్‌ వినిపిస్తోంది.

రెండుపార్టులుగా మూవీ

ఏప్రిల్‌ తర్వాత ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తారట మేకర్స్‌. ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామాగా రానున్న ఈ మూవీకి విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంకా చోప్రా, విలన్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

20250102 0958063786155021874801279

అలాగే ఓ ప్రముఖ హాలీవుడ్‌ క్యాస్టింగ్‌ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారట. సో…ఈ సిని మాకు హాలీవుడ్‌ నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా వర్క్‌ చేస్తారు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలిభాగం 2027లో, మలిభాగం 2029లో విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీని రిలీజ్‌ చేయాలను కుంటన్నారు.సో..గ్రాఫిక్స్‌ విషయంలో అత్యాధునిక సాంకేతికత, ఏఐ వినియోగం, ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్, ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌కు ఎంట్రీ… తదితర అంశాలకు చెందిన ఇబ్బందులు ఉండకూదని ఓ అంతర్జాతీయ నిర్మాణసంస్థతో అసోసియేట్‌ అవ్వాలని రాజమౌళి భావిస్తున్నారని తెలిసింది.

AlluArjun: అల్లు అర్జున్‌తో కొరటాల..మరి దేవర 2?

సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసిన మహేశ్‌బాబు

తన సినిమాల ప్రారంభోత్సవాలకు వస్తే తనకు కలిసి రాదని మహేశ్‌బాబు భావిస్తుంటారు. గతంలో ఒకట్రెండు సందర్భాల్లో మహేశ్‌ సినిమాల రిజల్ట్‌ విషయంలో ఇది జరిగింది. దీంతో కొంతకాలంగా తన సినిమాల ఓపెనింగ్‌ కార్యక్రమాలకు మహేశ్‌బాబు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ రాజమౌళితో చేస్తున్న ఈ మూవీ షూటింగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మహేశ్‌బాబు పాల్గొనడం విశేషం. ఇలా పాత సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేశారు మహేశ్‌బాబు.

Nagavamsi:తెలుగు ప్రముఖ నిర్మాత నాగవంశీపై బాలీవుడ్‌ దర్శకుల వ్యంగ్యాస్త్రాలు

పదిహేను సంవత్సరాల క్రితమే జరగాల్సింది!

20250102 102705329234407939965223

మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లోని మూవీ పదిహేను సంవత్సరాల క్రితమే జరగాల్సింది. కానీ కుదర్లేదు. 2010లో రాజమౌళితో మూవీ చేయనున్నట్లుగా మహేశ్‌బాబు పేర్కొన్నారు. అయితే అప్పట్నుంచి ఈ సినిమా వాయిదా పడుతూ, ఎట్టకేలకు ఇప్పుడు ..అంటే పదిహేను సంవత్సరాల తర్వాత ప్రారం భమైంది. ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజైన మూడు సంవత్సరాల తర్వాత రాజమౌళి తన నెక్ట్స్‌ మూవీని మహేశ్‌బాబుతో చేస్తుండటం విశేషం.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi