VARANASI: మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. మైథలాజికల్ టచ్‌తో సాగే, ఈ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు ఇప్పటికే డిఫరెంట్ టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ‘రాజకుమారుడు’, ‘రాజా’ వంటి టైటిల్స్ వినిపించాయి. కొత్తగా మరో టైటిల్ తెరపైకి వచ్చింది. అదే ‘వారణాసి’ (SSMB29 title is Varanasi).
అవును…మహేశ్‌బాబు– రాజమౌళి కాంబినేషన్‌లోని సినిమాకు (SSMB29) ‘వారణాసి’ (Varanasi Title)అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్. ఆల్రెడీ ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో దాదాపు రూ. 50 కోట్లతో మేకర్స్ ఓ వారణాసి సెట్ వేశారు. ఆల్రెడీ కొన్ని సన్నివేశాలను ఈ సెట్‌లో తీశారు. మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.
మరోవైపు ప్రస్తుతం ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి. అక్టోబరు 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఆ తర్వాత మళ్లీ మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ను స్పీడప్ చేస్తారు రాజమౌళి. ఇక నవంబరులో ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను అధి కారికంగా ప్రకటిస్తామని రాజమౌళి ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబరు 16న ఈ సిని మాకు సంబంధించిన ఓ భారీ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతుందని, ఈ కార్య క్రమంలోనే ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం.
అలాగే ఈ ఏడాది ఆగస్టులో కెన్యాలో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్‌ను జరిపారు రాజమౌళి. ఈ చిత్రం ప్రధాన తారాగణం ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌సుకుమారన్‌లు పాల్గొన్నారు. కాగా, ఈ ఏడాది డిసెంబరులో రాజమౌళి, మహేశ్‌బాబు అండ్ టీమ్…మరోసారి కెన్యా వెళ్తారని, అక్కడ మరో లాంగ్ షెడ్యూల్ షూట్ చేస్తారని, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలు తీస్తారని తెలిసింది. జనవరిలో హైదరాబాద్‌లోని ‘వారణాసి’ సెట్స్‌లో మరోసారి ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ సినిమాను 2027 ప్రారంభంలో రిలీజ్ చేయాలని రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని టాక్.